.
కాటుక కళ్ళు –
కళ్ళల్లో కనపరిచే ప్రేమని చూడు….
కళ్ళు వాల్చే సిగ్గుని చూడు…
కళ్ళల్లోని దీనత్వాన్ని చూడు…
కళ్ళల్లోని నిస్సహాయతకి చేయూతనివ్వు..
కళ్ళు పలకరించే బాషాని అర్థం చేసుకో…
కళ్ళలోని అమాయకత్వానికి దాసోహం అవు…
కానీ
అందమైన కాటుక కళ్ళల్లో కన్నీరుని మాత్రం రానివ్వకు ….
.

తాపం –
ఊపిరి లోను నువ్వే….ఊహల్లోనూ నువ్వే..
దాగుడుమూతలు చాలించవే…దరి చేర రావే…
దాసోహం అయ్యానే దాహం తీర్చవే..
తాపం లో తడిసి పోతున్నానే చెలీ..
తల్లడిల్లి పోతున్నానే ప్రియసఖీ…
తడిసిపోతున్న నా తాపాన్ని ..
తమకంగా
తపనతో
తనివితీరా
తన్మయత్వంలో ముంచేయవే ప్రియ భామినీ….
.
———(0)———-
.
Leave a Reply