అంతటా వున్నాడు శ్రీరాముడు
ప్రతిచోటా ఉన్నాడు పరంధాముడు
మనసు నిల్ప శక్తి కలిగి
వాక, కర్మల శుద్ధి కలిగి
భజిస్తే, స్మరిస్తే
ప్రార్థిస్తే, కీర్తిస్తే
|| అంతటా ||
నీటివలె నిర్మలుడు
పట్టుకంటే మెత్తనైన
వెన్నవలె, తేనెవలె
మనసున్న మహారాజు
|| అంతటా ||
అహంకార మావరించి
ఐహికములు చుట్టుముట్టి
విర్రవీగి, నేలబడి
అంతులేని అగాధాల
పడిపోతూ, రోదిస్తూ
ఖిన్నులమైనట్టివేళ
తను తానే ఎదురువచ్చి
రక్షించే ఇలవేలుపు
మనరాముడు
మన దైవం
|| అంతటా ||
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾
Leave a Reply