శ్రీ వెంకటేశా శ్రిత పారిజాతా
కరుణించి బ్రోవరా కరుణాంత రంగా
శ్రీ వెంకటేశా శ్రిత పారిజాతా
భవ బంధ నాలెల్ల బాధలను పెంచె
భక్తి విశ్వాసములు మృగ్యమై పోయే
పంజరపు బ్రతుకే కడు రోతగా మారే
ఆత్మ కీరమ్మిపుడే స్వేచ్ఛనే కోరే || శ్రీ వెంకటేశా ||
ఏడు కొండలపైన వెలసి ఉన్నావయ్య
తరలి రారా తండ్రి తరలి రమ్మిపుడే
నా హృదయమే నీకు నెలవుగా జేసెదను
నా తలపు కుసుమాల మాలలే వేసేదను || శ్రీ వెంకటేశా ||
శ్రీదేవి భూదేవి నీ చెంతగా చేరి
భువన మోహన కడు సొంపార నిలిచేరు
మాపైన మెండుగా దయ జూపవయ్య
నిన్న నేడని కాదు ఏనాటి కానాడు || శ్రీ వెంకటేశా ||
సప్తాచలాధీశ శ్రీశ్రీనివాసా
కరుణించి బ్రోవంగ కదలి రావయ్యా
శ్రీ వెంకటేశా శ్రిత పారిజాతా
కరుణించి బ్రోవరా కరుణాంత రంగా
కరుణాంత రంగా
కరుణాంత రంగా
రంగా ఆ… ఆ…