భక్తి ఉద్యమాన్ని ప్రజా బాహుళ్యానికి చేరువ చేసి పరమేశ్వర కటాక్షానికి తమ రచనల ద్వారా పాత్రులయ్యేలా చేసిన భాగవత శిఖామణులైన వాగ్గేయకారులను గురించి తెలుసుకోవడం జిజ్ఞాసువులైన మనందరి కర్తవ్యం. భక్త వాగ్గేయకారులు బంగారపు ముద్ద అయిన భగవదనుభూతిని, కాంతులీనే అద్భుత సాహిత్య భావములను సంగీత మాధ్యమంలో పొదిగి రత్నహారాలుగా మలిచి అందించి తమ రచనల ద్వారా మనల్ని కూడా ఆ సర్వేశ్వరునికి చేరువ చేశారు.
12వ శతాబ్దంలో గౌడ దేశీయుడైన జయదేవ మహాకవి రాగతాళములతో నృత్యానుకూలముగా ఎనిమిది చరణములతో కూర్చిన అష్టపదులను రచించిన మొట్టమొదటి వాగ్గేయకారుడు.
.
👉🏾మీకు నచ్చితే Like బటన్ నొక్కండి. మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (comment box) లో తెలియజేయండి👇🏾