10_005 ద్విభాషితాలు – నీ పాట వుంది

మేము…

మా జీవనవనంలో..

నీ గానసుమసుగంధాన్ని నింపుకున్న..

ఆస్వాదకులం.

నిత్య స్వరార్చనలో..

నీ గళాన్ని సేవించే..

ఆరాధకులం!

గంధర్వులు అమరులంటారు.

మరి నీకీనిర్గమనమెందుకు?

నీ పాటని అర్చించే చేతులతో..

నీకు నివాళులర్పించగలమా?

వేలాది గాయకులు పుట్టొచ్చు.

వీనులకు విందు చెయ్యొచ్చు.

మనసులో నీ గానం..

పొంగుతుంటే..

వేరెవరికి చోటివ్వగలం? 

నువ్వు అదృశ్యమవుతే..

మా శ్రవణం.. నిర్జీవమవమవుతుందని తెలిసి..

మాకోసం..

ఋతువులన్నిటినీ..

వసంతాలుగా మార్చావుగా!

వేలాది కోయిలలుగా..

ఎగిరొచ్చి..

మళ్ళీ మళ్ళీ…

మాకు వినిపిస్తూనే వుంటావు!!

*****