10_004 ద్విభాషితాలు – మాతృమూర్తి

యుగాల వెనుక…

మాతృత్వం కోసం…

ఆమె….

నాకు జన్మనిచ్చింది.

తన సొగసుల్ని…

నాకు అద్దింది.

మబ్బునుంచి …

గమనాన్ని..

సెలయేరు నుంచి…

చైతన్యాన్ని…

మొక్క నుంచి..

వినయాన్నీ..

నాకు నేర్పింది.

నన్ను మనిషిని చేసింది.

కోటానుకోట్ల జీవరాసులకి జన్మనిచ్చినా..

ఆమె అసమాన సౌందర్యం…

కించిత్తైనా చెక్కుచెదరకపోవడం…

నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

తన సంపదల్ని..

మనం కొల్లగొట్టినా…

ఇవ్వడమే తన తత్వమవ్వడం..

నన్ను కదిలిస్తుంది.

ఆమె ఓ అద్భుతం.

ఆమె ప్రేమ అనంతం.

సహోదరులారా!

ప్రకృతి మన మాతృమూర్తి!

ఆమెను కలుషితం చెయ్యొద్దు.

కాంతి విహీనం చెయ్యొద్దు.

కాపాడదాం.

ఋణం తీర్చుకొందాం.

ప్రకృతిని ప్రేమించడమంటే…

జీవితాన్ని అలంకరించుకోవడం.

జీవనాన్ని అందంగా దిద్దుకోవడం !

********************************