భద్రాచల రామదాసు కీర్తన
అది తాళం – ఖమాస్ రాగంలో ‘ నాదయోగి ‘ నేదునూరి కృష్ణమూర్తి గారి స్వరరచన.
గానం : శ్రీదేవి జోశ్యుల
పల్లవి:
రామజోగి మందు కొనరే ఓ జనులార రా ॥
అను పల్లవి:
రామజోగి మందుకొని ప్రేమతో భుజియించుడన్న
కామక్రోధ లోభమోహ ఘనమైన రోగాలకు మందు రా ॥
చరణము(లు):
కాటుక కొండలవంటి కర్మములెడబాపే మందు
సాటిలేని జగమునందు స్వామి రామజోగిమందు రా ॥
వాదుకు చెప్పినగాని వారి పాపములు గొట్టి
ముదముతోనే మోక్షమిచ్చే ముద్దు రామజోగిమందు రా ॥
ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించే మందు
సదయుడైన రామదాసు ముదముతో సేవించే మందు రా ॥
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page