12_012 రామాయణం లో మహోన్నత పాత్రలు

బ్రహ్మవాల్మీకి మౌనితో పల్కెనిట్లు

పర్వతములుండు నాకో ప్రపంచమందు

నదులు ప్రవహించుగాక జనశ్రుతము

మహిని వర్ధిల్లుగాక రామాయణంబు !

                    – కీ. శే. డా. శంకర శ్రీరామారావు గారు

రామాయణంలో నన్ను అత్యధికంగా ప్రభావితం చేసినవి అందులోని పాత్రలు. ఇటువంటి పాత్రలు ఏ కావ్యంలోనూ మనకి గోచరించవు. రఘువంశంలోని పాత్రల్లోనే కాక ప్రతినాయకుడైన రావణుని లోని శ్రేష్ఠమైన గుణగణాలను, రాజనీతిని విశ్లేషించని విమర్శకులు లేరు. జగదభిరాముడైన రాముని పాత్ర యొక్క విశిష్ఠత వర్ణించడం అంటే మానవులకు అసాధ్యము. పితృవాక్య పరిపాలనకు, ప్రజాహితవు కొరకు తనయునిగా, మహారాజుగా ధర్మపథము వీడని త్యాగనిరతకు నిండు నిదర్శనము శ్రీరాముడు. సీత రాముని కొరకు, లక్ష్మణ, భరత, శతృఘ్నులు శ్రీరామునియందు భక్తి ప్రేమలతా, చేసిన త్యాగము శ్లాఘనీయము. కనుకనే రామాయణము నేటికినీ కొనియాడబడుచున్నవి. పాత్రలన్నీ తమ సౌఖ్యం, తమ స్వార్థం తలవక ఆదర్శప్రాయంగా నిలిచాయి. ఉదాత్తమైన హనుమంతుని పాత్ర లో వాల్మీకి స్వామిభక్తి, విశ్వాసం, రామనామామృత పరిమళాన్ని నిత్యానందకరంగా సామాన్యులకు తెలియజేసిన తీరు జనరంజకం. సీతాదేవి త్యాగాగ్ని హెచ్చా ? అన్నరాజ్యము అంటనన్న భరతుని త్యాగం ఘనమా ? సీతారాముల చరణముల తమ జీవితం అర్పించిన లక్ష్మణుని త్యాగనిరతి గొప్పా ? అందరూ అందరే ! వారి పాత్రలను ఆదర్శంగా తీసుకొని మానవజన్మ సార్థకం చేసుకొమ్మని సందేశానిస్తాయి.

రామాయణం ఆధారం అన్నీ భాషలలో నాటికలు, నాటకాలు, చలనచిత్రాలు వచ్చాయి. రామాయణాలు వివిధ భాషలలో అనువదించారు. ఆంగ్ల భాషలో ప్రదర్శించబడిన “ Ramayan Ballet ” అత్యంత జనాదరణ పొందింది. అవనీభారము తీర్చి, జీవకోటికి ఆదర్శమూ చూపి, మానవకళ్యాణం కొరకు భువికేతించిన శ్రీరాముని పూజించి సంవత్సర ప్రారంభం దిగ్విజయంగా జరుపుకోవాలి. శ్రీరాముని వలెనే సన్మార్గము నెంచుకొని ఆయన పాదపద్మములకు పూజించి తరింతురు గాక !

వాల్మీకి సృష్టించిన ఈ ఉదాత్త పాత్రలు ప్రజల హృదయాలలో హత్తుకొని అజరామరమయినవి. రామాయణంలో కుటుంబ వ్యవస్థ, రాజనీతి, సేవ, భాతృ, పితృభక్తి, పతివ్రత్యం, సత్యనిష్ట, ఎన్నో విలువైనవి నిక్షిప్తమై వున్నాయి. అవి మనకు మార్గదర్శి.       

****************************************

గమనిక :  ఆగష్టు నెల పన్నెండవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం తమ రచనలను, చిత్రాలను, శ్రవ్య  అంశాలను ప్రచురణ కోసం పంపించదల్చుకున్నవారు జూలై 25వ తేదీ లోగా పంపించవలెను. వాటితో బాటు అవి మీ స్వంతమేనని, దేనికీ అనుసరణ కాదని, ఇంతకుముందు ఏ ప్రింట్ పత్రికకు గాని, వెబ్సైట్ కు, అంతర్జాల పత్రికకు, మరే ఇతర మీడియా కు ప్రచురణ నిమిత్తం పంపి ఉండలేదని హామీ పత్రం కూడా జతపరచాలి. రచనలు యూనికోడ్ లో టైప్ చేసి MS Word ఫైల్ గా పంపించాలి. లేదా నిడివి తక్కువగా ఉంటే మెయిల్ లో type చేసి పంపించవచ్చును. ఆడియోలు, వీడియోలు సాధారణ ఫార్మాట్ లో మెయిల్ / డ్రైవ్ ద్వారా మాత్రమే పంపించాలి.

పంపించవలసిన మెయిల్ : editorsirakadambam@gmail.com ; చివరి తేదీ : 25 జూలై 2023

****************************************

👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾

——– ( 0 ) ——-

 

అమెజాన్ లో మీకు కావల్సిన వస్తువులు ఈ పేజీ నుంచి కొనుగోలు చేయండి