09_018 మా నాన్న-కర్మజీవి

5 Replies to “09_018 మా నాన్న-కర్మజీవి”

 1. దశరథ తనయుడు తండ్రి మాటకి కట్టుబడి రాజ్యం విడిచి
  అరణ్యాలకు వెల్తే, తండ్రి మాట విని శ్రీ గొర్తి వెంకట సూర్య సత్యనారాయణ మూర్తి గారు జనారణ్యము విడిచి తండ్రిని చేరి
  పవిత్ర వ్యవసాయం వృత్తిగా చేస్తూ, తల్లిదండ్రులకు సేవ చేస్తూ, అన్నగారి భూమి కూడా నిస్వార్థంగా సాగు చేసి ఫలసాయం వారికి అప్పజెప్పిన తీరు ఒకటయితే, మూగ జీవాలు ప్రేమతో యజమానిని చూడడానికి పొలం నుంచి ఇంటికి వచ్చిన తీరు ఆవిష్కరణ మనసుని కదిలించింది.

 2. దశరథ తనయుడు తండ్రి మాటకి కట్టుబడి రాజ్యం విడిచి
  అరణ్యాలకు వెల్తే, తండ్రి మాట విని శ్రీ గొర్తి వెంకట సూర్య సత్యనారాయణ మూర్తి గారు జనారణ్యము విడిచి తండ్రిని చేరి
  పవిత్ర వ్యవసాయం వృత్తిగా చేస్తూ, తల్లిదండ్రులకు సేవ చేస్తూ, అన్నగారి భూమి కూడా నిస్వార్థంగా సాగు చేసి ఫలసాయం వారికి అప్పజెప్పిన తీరు ఒకటయితే, మూగ జీవాలు ప్రేమతో యజమానిని చూడడానికి పొలం నుంచి ఇంటికి వచ్చిన తీరు ఆవిష్కరణ మనసుని కదిలించింది.

 3. Older generation are committed to desires of their elders.even if they have to sacrifice their choice oflife that’s the way they lead the life.
  He was a great soul who enjoyed his life in bringing the children and giving them the freedom to choose the profession rather asking them to join the agriculture.
  But his qualities of meticulas planning and execution we can see in our friend Bhadhri.
  No doubt he is karma yogi.

 4. “అమ్మ దేవుడి అంశ అయితే నాన్న సాక్షాత్ దేవుడు.”
  ‘అమ్మకు, బ్రహ్మకు నిచ్చెన నాన్న అంటారు. నాన్నలు ముఖ్యంగా మధ్య తరగతి కుటుంబాలలో, ఎన్నో త్యాగాలు చేసి పిల్లలను పైకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తారు.
  పితృ దినోత్సవం సందర్బంగా గొర్తి బద్రి శాస్త్రి గారు రాసిన వ్యాసం మా నాన్న కర్మ
  జీవి చదువుతుంటే నాన్న- సముద్రమంత గంభీరంగానూ, అకాశమంత నిర్మలంగానూ, విలుప్త అగ్నిపర్వతం మాదిరి గుండె నిబ్బరం తోనూ జీవించగలడు అనే దానికి నిదర్శనం
  గొర్తి వెంకట సూర్య సత్యనారాయణ మూర్తి గారు అని వేరేగా చెప్పనక్కర్లేదు.
  స్వతహాగా విద్యాధికుడు మరియు ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్నప్పటికీ ,
  తండ్రి మాట కోసం తన ప్రగతిని పణంగా పెట్టి, మట్టిని నమ్ముకుని మట్టి మనిషి అయిపోయి ఆ మట్టిని బంగరముగా మార్చిన వ్యక్తి సత్యనారాయణ మూర్తి గారు. ఎటువంటి భేషజాలకు పోకుండా ఉన్నదాంట్లో ఊరి వాళ్లకు సహాయం చేసిన వ్యక్తిగా అతని ఉదారత్వానికి మరియు
  మంచితనానికి పరాకాష్ట అతని జీవితం .
  ఇదంతా రాయడానికి కారణం నేను స్వయంగా బద్రి గారి స్వగ్రామం నేదునూరు అలాగే వాళ్ళ అన్నదమ్ములు అప్పచెలళ్ళు తమ బాల్యాన్ని గడిపిన
  ఆ ఇల్లును వీక్షించిన తరువాత ప్రతి ఒక
  వస్తువును అలాగే బద్రి గారు ఆఇంటితో
  ఉన్న అనుబంధం వాళ్ళ నాన్నగారి విశేషాలను ముచ్చటించినప్పుడు అతనిలో ఆనందం అభిమానం చాలా దగ్గరగా చూసాను. మొత్తం చరిత్ర అంతా
  ఒక సినిమా రీలుగా అనిపించింది.
  అటువంటి మహానుభావుల జీవితం
  భావితరాల వాళ్ళకి ఒక స్ఫూర్తి మరియు ప్రేరణదాయకం.

 5. తండ్రుల దినోత్సవం అన్న మాట చాల చిరాకు గా ఉన్నా, బదరి నాన్నగారి లాంటి విశిష్ట వ్యక్తిని తెలుసుకునే అవకాశం కల్పించినందుకు సంతోషించాలేమో 
  ప్రతి వ్యక్తికీ తన  తండ్రి గురించి చెప్పాలనే ఉంటుంది.. కానీ తన రచన సామర్ధ్యాన్ని చాలా పొదుపుగా వినియోగిస్తున్న బదరి, ఇక్కడ పొదుపు చూపించకుండా చాలా విపులంగా రాశాడు . అలా రాయడం నాలాంటివాడికి సాధ్యం కాదు. మనసులోని భావాలని చక్కగా వ్యక్తీకరించగలగడం నేర్చుకుంటే వచ్చేది కాదేమో . 
  వాళ్ళ నాన్నగారిని , వాళ్ళ ఇంట్లోనే కలవడం , కలిసి భోజనం చేయడం ఒక మధురమయిన స్మృతి .

  మా నాన్న గురించి కూడా రాయాలనిపించేలా రాసిన బదరికి, రాయించిన రామచంద్ర రావు కి అభినందనలు —రమణ శర్మ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *