December 2022

12_006 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 05

పంచాక్షరీ జప తత్పరుడైన లీలాశుకునికి ఎప్పుడో ఒకసారి బాలకృష్ణుని ముగ్ధ మనోహర రూపం కనులకు సాక్షాత్కరించిందట. అంతే అప్పటినుండి మనసు నిండా నందకిశోరుడే నిండిపోయాడు. ఆ స్వామి భావనలో మునిగిపోయిన లీలాశుకుడు గోపాల బాలుని శైశవ లీలలు, అతి మానస చేష్టలు, వేణు రవామృత ఘోషలు, ముద్దుకృష్ణుని రూప లావణ్య వర్ణనలు, కన్నయ్య తలపులోని భక్తి పారవశ్యం రాగరంజితాలై శ్లోక రూపంలో హృదయ కర్ణామృతాలై కృష్ణానందంలో తెలియాడిస్తాయి…. చదువరుల మనసును కూడా…

12_006 జనకమహర్షి

వెనుకటి జన్మమందు మరి వేల్పుల నెవ్విది మ్రొక్కినానో తా
తనయగ వచ్చె లక్ష్మి తెలితామర గద్దెగ మారె జన్మముల్
జనకుడుగా తరించుటకు చాలకపోయెనో పుణ్యమంతయున్
జనకుని రూప ధారణకు చాలెను సుప్రీతి అంతె చాలులే !

12_006 అన్నమాచార్య కళాభిజ్ఞత12

దశావతారాల్లో భగవంతుని యొక్క అవగుణాలని చెబుతున్నాడు కవి. చూడటానికి అవగుణాలుగా కనిపించే విషయాలలో వాటి వెనుక ఉండే అర్థం… అంటే వస్తువుకి, విషయానికి ఉండే బేధాన్ని చెబతున్నారు. విషయం ఎప్పుడయితే అవగతమయిందో, అవగాహన కంటిందో…. అది వెంటనే అర్థమై, పదార్థమై, పరమార్థమై, విశేషార్థమై, తాత్వికమై సామాన్యునికి అంది…. ఈ సామాన్యుడు పురోహితమవుతాడు అని నమ్మి ఆ మార్గాన్ని చేపట్టినవాడు ఈ కవి. అన్నమాచార్యులవారు వేద పురుషుని ధర్మాలు మాత్రమే వెల్లడి చేశారు.

12_006 ముకుందమాల – భక్తితత్వం 13

శ్రీకృష్ణుని సౌందర్యముద్రామణి అనీరుక్మిణిదేవికి మణి భూషణమనీ గోపాలచూడామణీ అనీ చెబుతూ భక్తుల పాలిటికి త్రైలోక్యరక్షామణి ఇతడు అంటూ వర్ణిస్తారు శ్రీ కులశేఖరులు. అన్నమయ్య ఈ గోపాలదేవునే యశోద ముంగిట ముత్యంగాగొల్లెతల అరచేతి మాణిక్యంగా కాళింగుని తలపై పుష్యరాగంగా వర్ణిస్తూ కంసుని పాలిట వజ్రమైన ఈ దేవుడు మాకు గతియైన కమలాక్షుడు అంటూ వర్ణిస్తారు. ఏమి ఈ భక్తుల భావ సారూప్యం!