13_002

13_002 ద్విభాషితాలు – పేద

ప్రకృతి ఒడిలో విభిన్న సౌందర్యాలు…. మనిషి ఆనందం కోసమేనన్న సత్యాన్ని విస్మరించి…. యాంత్రికంగా జీవిస్తున్న మనిషి తీరు ఈ కవితకు ప్రేరణ.

13_002 ఆనాటి రాక్షస వీణ – వైయోలిన్

క్రీస్తు పూర్వం ఐదు వేల సంవత్సరాల నాటిది మన దేశంలోని ‘ రావణ హత్త ’ ఎటువంటి మార్పులూ లేకుండా అప్పటి ఆకార విశేషాలతోనే ఉన్న ఈ వాయిద్యం ఇప్పటికీ రాజస్తాన్, గుజరాత్ లలోని జనపదాల మధ్య మోగుతూ ఉండడం విశేషం. 22 అంగుళాల ఈ వాయిద్యం తయారీ ఆసక్తికరంగా ఉంటుంది. ఒక కొబ్బరి చిప్పను మేక చర్మంతో కప్పి, వెదురుతో చేసిన దండితో కలుపుతారు. దీనిపై రెండు తీగలను బిగిస్తారు. ఒకటి గుర్రం వెంట్రుకతో చేసినది, ఇంకొకటి స్టీల్ తో చేసినది. అప్పట్లో నేటి రాజస్తాన్, గుజరాత్ లలోని రాజ్యాల యువరాజులకు మొట్టమొదట ఈ వాయిద్యం మీదే సంగీత శిక్షణనిచ్చేవారు. ఇదే వాయిద్యం తొమ్మిదో శతాబ్దంలో తూర్పు మధ్య దేశాలకు, యూరప్ కు చేరిందట. ఐరోపా దేశంలో దీన్ని ‘ రావణ స్ట్రాంగ్ ’ అని పిలిచేవారు. వైయోలిన్, వయోలా, గిటార్ వంటి పరికరాలు ఇందులో నుంచే క్రమంగా రూపుదిద్దుకున్నాయి.

13_002 అన్నమాచార్య కళాభిజ్ఞత 17

సూత సంహితలో ఒక దివ్యమైన శ్లోకం చెప్పుకుందాం.
” గీతి గానేనయోగస్యాత్ l యోగా దేవ శివైక్యతా
గీతిజ్ణ ఓ యది యోగేన l సయతి పరమేశ్వమ్ ll ”
సంగీతం ఒక దివ్యమైన సాధన. ఒక మహా యోగం.
ఆ మహా యోగ సాధన వలన జీవునికి బ్రహ్మపద ప్రాప్తి కలుగుతుంది.
సంగీత జ్ఞానము వలన ఐశ్వర్యము అంటే ఈశ్వర తత్వ సిద్ధి కలుగుతుంది
అని భావం .
ఇది లోతెైన విషయం, లౌకిక విషయం కాదు.

13_002 మందాకిని – నీలోత్పల

ఉత్తుంగ తరంగాలతో ఎగిసిపడే ఈ జలవాహిని చూస్తూ వుంటే కాలంతో పోటీగా పరుగెత్తాలని ప్రయత్నిస్తుందా అనిపిస్తుంది. పరవళ్ళు తొక్కుతూ పరుగెత్తుకొచ్చే అలలకు కూడా గమ్యం లేదు. నేను ముందంటే నేను ముందు అంటూ వచ్చి ఒడ్డును తాకే అలలు, ఆ అలలు మోసుకొచ్చే అల్చిప్పలు, సముద్రం మీద నుంచి వీచే స్వచ్చమైన గాలి, విస్టారంగా విశ్వమంతా పరుచుకొని ఎక్కడో కనుచూపుకి ఆననంత దూరంగా సముద్రాన్ని తాకుతున్నట్లున్న నీలాకాశం, ఆకాశంలో గుంపులు గుంపులుగా ఎగురుతూ గూళ్లను చేరుకొంటున్న పక్షులు ఇదంతా చూస్తూ వుంటే సృష్టి ఇంత అద్భుతమైనదా ? అని ఆశ్చర్యం కలుగుతుంది. రాత్రనక పగలనక హోరుమని శబ్దం చేస్తూ ఉండే ఈ జలరాశి ఇక్కడ ఎప్పటి నుంచి వుంది ? కొన్ని కోట్ల సంవత్సరాల నించి ఇలాగే వుందా ? కదలకుండా ఇక్కడే వుండమని ఎవరు శాసించి వుంటారు ? ఏది ఏమైనా సముద్రం వంక చూస్తూ వుంటే మనల్ని మనం మనం మర్చిపోతాం. ప్రపంచాన్ని మర్చిపోతాం. బాధలు, భయాలు, ఆశలు, నిరాశలు సమస్తం మాయమయి పోతాయి.

13_002 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 08

అనాది నుండి పరమేశ్వరుడు స్వయంగా మెచ్చి కొలువున్న పట్టణం వారణాశి. సంగీత, సాహిత్య, ఆథ్యాత్మిక త్రివేణీ సంగమ స్థలం. జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని భావించే ప్రతి ఒక్కరూ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వర దేవుని దర్శించుకోవాలని తలపోస్తూ వుంటారు. అటువంటి కాశీ వాసులైన కొందరు భక్తుల గురించి చెప్పుకుందాం. భక్త కబీరు గురించి, ఆయన జీవిత విశేషాల గురించి చెప్పుకుందాం. ఎంతవరకు నిజమో తెలియదు గాని కబీరు దాస్ పుట్టుక గురించి ఒక అలౌకికమైన కథ ప్రచారంలో ఉంది. అది…..

13_002 సాక్షాత్కారము 05

తే. గీ. ఏమహాశక్తి త న్నావహించెనొ ? యన
తరుణిపై పతి ప్రేమగీతాలు పాడు :
అంత నెద పొంగి మగతోడు నరసియరసి
కూర్మి గట్టిగా వాటేసికొను కపోతి !

13_002 వరసిద్ధి వినాయక వ్రతం

మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి. వీటికి మరో పద్దెనిమిది ఉప పురాణములు ఉన్నాయి. ఈ ఉపపురాణములలో గణేశ పురాణము, ముద్గల పురాణము అనేవి ముఖ్యమైనవి. దీనికి కారణం ఈ రెండు పురాణములలోనూ గణేశుడు ఏ విధంగా ఈ సృష్టి కంతటికీ మూలమైన వాడో అనే విషయం గురించిన వివరణ ఉంటుంది.
గణేశుడు, వినాయకుడు, గణపతి…. ఇలా అనేక పేర్లతో పిలువబడే శివపార్వతుల కుమారుడైన ఈ దైవానికి ప్రతి యుగములోనూ కూడా ఒక్కొక్క రూపం ఉందని ఈ పురాణాలు చెబుతున్నాయి. గణేశ పురాణంలో గణపతి యొక్క నాలుగు అవతారాలు చెప్పడం జరిగింది. అవి ఏమిటో వాటి విశేషాలేమిటో వివరిస్తారు…