Chaturdashi

13_004 దివ్వెల పండుగ

మానవుడు వెలుగును – ఆథ్యాత్మిక, ఆదిభౌతిక సంపదలకు చెందినది – సంతరించుకోవడం కోసం ప్రాకులాడుతూ వుంటాడు. ప్రాపంచిక రీతులలోనుంచి, గతుల నుంచి తప్పించుకొని, తపస్సిద్ధ్హి సంపన్నుడు కావడానికి ప్రయత్నిస్తూ వుంటాడు. విజ్ఞాన తేజః పుంజంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ వుంటాడు. అలాటి స్థితికి ప్రతీక దీపావళి. దివ్వెను చూస్తే మనస్సులో ఏదో మువ్వల మ్రోత వినిపిస్తుంది. అది అద్భుతమైన స్పందన. అలాటి వెలుగును కనులారా దర్శించి, మనస్సులో వెలుగులో కలబోయడం కోసమే దీపావళి.

12_008 దివ్య దంపతుల చూపుల పందిళ్ళు

నదులన్నీ నంది దేవుని మెడలో గంటలవలె కెరటాల చప్పుళ్ళు వినిపిస్తాయి. ప్రతి అణువు శివోహమ్ – అంటూ అహరహం స్మరించి తరించాలని ప్రాకులాడుతూ వుంటుంది. ఆ శబ్దాలు ప్రతి హృదయంలో స్పందిస్తాయి. పరమేశ్వరుని కృపకోసం ఎదురుచూస్తూ వుంటాయి.

12_008 శివతత్వమ్

అవ్యక్తమైన స్వరూపం కలిగినవాడు శివుడు. సృష్టి, స్థితి, లయ అనే వరుస సాధారణమైనది. ఇలా సృష్టి నుంచి కాకుండా లయం నుంచి ప్రారంభమైతే సృష్టి జరిగి స్థితి అనేది లయకారుడైన ఈశ్వరుడు తనంతట తాను తనలోకి తీసుకునే వరకు ఉంటుంది.