Composer

13_006 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జనవరి కార్యక్రమం “ మట్టిబండి – రచనా వైశిష్ట్యం ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు, తణుకు లో జరిగిన “ 85వ త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవములు ” కార్యక్రమ విశేషాలు……

13_006 రామా నీపై…

భోగాల అనుభవములందు బాగుగా బుద్ధి నీయందు
త్యాగరాజుని హృదయమందు వాగీశా ఆనందమందు

కేదారం రాగం, ఆది తాళం లో త్యాగరాజ కీర్తన….

13_006 ఇందరు మనుషులు

డా. సి. నారాయణరెడ్డి గారు రచించిన తెలుగు గజల్ శ్రీమతి సి. ఇందిరామణి స్వరకల్పనలో పద్మజ శొంఠి గారు ఆలపించారు. ఈ గజల్ 1980 దశకంలో హైదరాబాద్ దూరదర్శన్ లో ప్రసారమయింది.

13_005 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా నవంబర్ కార్యక్రమం “ నాద తనుమ్ స్మరామి ” విశేషాలు, డిసెంబర్ కార్యక్రమం “ హిందూ మహాసముద్రంలో తెలుగు వాణి ( మారిషస్ అనుభవాలు ) ” కార్యక్రమ విశేషాలు, కాకినాడ లో జాతీయ కాంగ్రెస్ మహాసభల శత వసంతోత్సవం కార్యక్రమ విశేషాలు……

13_005 పరమపురుష…

భావుక చరణం భవసంతరణం
భవ్య సేవక జన భాగ్య వితరణం
అవ్యయ విమల విభూతి విజృంభిత దివ్య మణి
రచిత వివిధాభరణమ్‌

13_005 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 10

దక్షిణ భారతదేశంలో ప్రభవించిన వాగ్గేయకారులలో ముఖ్యంగా మహిళా వాగ్గేయకారులలో ముఖ్యంగా చెప్పుకోదగిన పేరు గోదాదేవి. ఆమెకే ఆముక్తమాల్యద అనే పేరు కూడా ఉంది. శ్రీరంగం పట్టణానికి చెందిన గొప్ప విష్ణుభక్తుడు విష్ణుచిత్తుని కుమార్తె ఈమె. సీతాదేవి వలెనే ఈమె కూడా అయోనిజ. విష్ణుచిత్తుడు ఒకరోజు ఎప్పటిలాగే విష్ణు కైంకర్యానికి మాలలకోసం తులసి వనానికి వెళ్ళినపుడు అక్కడ దొరుకుతుంది. భగవత్ప్రసాదం గా భావించి ఇంటికి తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతులు. విష్ణుసేవలో ఎదిగిన గోదాదేవి రోజుకొకటి చొప్పున ముఫ్ఫై రోజులపాటు గానం చేసిన పాశురాలన్నిటినీ కలిపి ‘ తిరుప్పావై ’ అంటారు. ఈ విశేషాలను వివరిస్తున్నారు.

13_004 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ నెల “నగరంలో దసరా శోభ ” విశేషాలు, మహానటి శ్రీమతి సూర్యకాంతం గారి శత జయంతి వేడుకల ప్రారంభోత్సవ సభలో ” తెలుగింటి అత్తగారు ” ప్రత్యేక సంచిక ఆవిష్కరణ విశేషాలు, హాంగ్ కాంగ్ లో “ బతుకమ్మ సంబురాలు ” విశేషాలు……

13_004 సమయము తెలిసి…

అసావేరి రాగం, మిశ్రచాపు తాళం లో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన.
సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి ఉండియేమి పోయియేమి