Culture

13_005 విదేశీయ శిల్పాలు

ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క శాస్త్రీయం, అనేక పామర నాట్యాలు. ఈ విభిన్నత నన్ను ఆకట్టుకుంది.
అందుకే వాటికి సంబంధించినవి కనబడితే చాలు… నిశితంగా గమనించకుండా వదిలిపెట్టలేదు. వాటికి కావలసిన దుస్తులు, ఆభరణాలు, భంగిమలు. అలంకరణలు.. అన్నీ తెలుసుకున్నాను. ఎందరో కళాకారుల ఆహార్యాన్ని, నాట్యాన్ని గమనించాను. కావలసిన సరంజామా సమకూర్చుకుని వాటిపై ప్రయోగాలు చేశాను. పట్టుదలగా కొనసాగించి చివరకు సాధించాను. భరతనాట్యం, కూచిపూడి, కథక్, మోహినీయాట్టం, కథకళి, మణిపురి, ఒడిస్సీ బొమ్మలు చేసేశాను.

13_005 ద్విభాషితాలు – వివశం

అమెరికన్ కవి అయిన Robert Frost కవిత… Stopping by the Woods on a Snowy Evening ఈ “వివశం” కవితకు స్ఫూర్తి! సౌందర్యాస్వాదనకు…. బాధ్యతా నిర్వహణకు మధ్య..మనిషి పడే సంఘర్షణ ఇందులో ప్రధానాంశం.

13_005 భక్త పోతన – జ్ఞాపకాలు

నాగయ్యగారు వేమనగా కూడా నటించారు. భక్త పోతనలో పోతన గారు ఆయనే !
కొన్ని పాత్రలు ధరించడానికి పూర్వజన్మ సుకృతం కూడా కొంత ఉండాలేమో ?
ఒక్కొక్క వ్యక్తి మన జీవిత గ్రంధంలో ఒక్కొక్క పుటగా నిలిచిపోతారు. కొందరి కథ చాలా పేజీలు. కొందరిది ఒక చిరునవ్వు. కొందరిది ఒక తియ్యటి మాట.
కొందరిది మనమోహనకరమైన చిత్రం మాత్రమే ! ఇవన్నీ తిరగేస్తుంటే ఏదో నూతనత్వం వస్తుంది. వయసు పెరిగాక మిగిలేవి వజ్రాల వంటి విలువైన జ్ఞాపకాలే !

13_004 వార్తావళి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి నెల నెలా వెన్నెల నవంబర్ కార్యక్రమం “ నాద తునుం స్మరామి ” వివరాలు, అమెరికా లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( NATS ) బాలల సంబరాలు 2023 కార్యక్రమ వివరాలు, 44వ క్లీవ్‌ల్యాండ్ త్యాగరాజ ఫెస్టివల్ వివరాలు …..

13_004 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ నెల “నగరంలో దసరా శోభ ” విశేషాలు, మహానటి శ్రీమతి సూర్యకాంతం గారి శత జయంతి వేడుకల ప్రారంభోత్సవ సభలో ” తెలుగింటి అత్తగారు ” ప్రత్యేక సంచిక ఆవిష్కరణ విశేషాలు, హాంగ్ కాంగ్ లో “ బతుకమ్మ సంబురాలు ” విశేషాలు……

సునాదసుధ – ఆథ్యాత్మిక తత్వ సంకీర్తన

అమెరికా చికాగో దగ్గరలో ఫ్లాస్ మోర్ లో ఉన్న ‘ సునాదసుధ ‘ సంగీత కుటీరంలో జరిగిన ప్రదర్శన.
…. బౌలి రాగం లో అన్నమాచార్య కీర్తన….
ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమే మున్నది
నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ||

13_004 సమయము తెలిసి…

అసావేరి రాగం, మిశ్రచాపు తాళం లో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన.
సమయము తెలిసి పుణ్యములార్జించని
కుమతి ఉండియేమి పోయియేమి