Feeling

13_008 మేలుకొలికే అద్భుతాలు

వాగ్గేయకారులైన అన్నమాచార్యులు, త్యాగరాజస్వామికి ప్రత్యేక స్థానం ఉంది. ఇద్దరూ తమ కృతులతో పామరుల నుంచి జ్ఞానులను సైతం ఆలోచింపజేశారు. ఆధ్యాత్మిక, వాస్తవికత, సమాజహితం… ఇలా అన్ని అంశాలను మేళవించి ప్రతి హృదయాన్ని పులకింపజేశారు. అందుకే వారి కీర్తనలు ఎప్పటికీ మానవాళిని మేలుకోలుపుతుంటాయి. వారు రాగం, భావం, సంగీతం సమపాళ్లలో రంగరించడంవల్లే ఎప్పటికీ నిత్యనూతనంగా విరాజిల్లుతున్నాయి.

13_008 ద్విభాషితాలు – అదృష్టవంతుడు

అనుమతులు… పరిమితులు లేకుండా రోజురోజుకీ పెరిగిపోతున్న శబ్దకాలుష్యం తెలియకుండానే ఎన్నో కార్యకలాపాలకు ఆటంకంగా నిలుస్తోంది. ఆ భావనలోంచి ఉద్భవించిన కవితకు దృశ్య శ్రవణ రూపమే ఈ అదృష్టవంతుడు

12_008 నిర్గుణ్ కబీర్ భజన్

భగవంతుడనే అమృతం నిశ్శబ్ద ధ్యానం నుంచి ఉద్భవిస్తుంది. వాయిద్య, గాత్రాలు లేని ఈ సంగీతమే నిశ్శబ్ద గానం.
మనసనే ఈ పవిత్ర వనంలో నీరు లేకుండానే కమలం (మెదడు) వికసిస్తుంది, హంసలు (ప్రాణం) విహరిస్తాయి.

11_004 సప్తపర్ణి కథలు – ఆవాహన

నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. నువ్వు పరిగెడితే నీకు చెమట పడుతుంది.
సృష్టి లో ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు విను. భారత దేశం లో విశ్వాసం, భక్తి, నమ్మకం, గౌరవం
అన్నీ రక్త గతం గా ఉంటాయి. ప్రతీ జీవ కణం లోను ప్రతిస్పందిస్తూ ఉంటాయి.
మంత్రం మన లోపలి ప్రపంచాన్ని ఏ విధం గా పరిరక్షించుకోవాలో చెప్తుంది
తంత్రం భౌతిక ప్రపంచాన్ని మనకనుగుణం గా ఎలా మలచుకోవాలో తెలియచేస్తుంది.