Kasi

13_004 సంగీతం – సర్వేశ్వరుని చేరే సాధనం 09

భక్త వాగ్గేయకారుల జీవితాలు మహిమాన్వితాలని చెప్పుకున్నాం కదా ! తులసీదాసు విషయంలో కూడా జరిగిన ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. ఒకనాడు ఒక స్త్రీ విలపిస్తూ తులసీదాసు పాదాలకు నమస్కరించింది. ఆమెను ‘ దీర్ఘసుమంగళీభవ ‘ అంటూ ఆశీర్వదించాడు. ‘ నన్నెందుకు అవహేళన చేస్తారు స్వామీ ! నా భర్త చనిపోయారు. ఆ దుఃఖం లో ఉండి మీకు నమస్కరించాను ’ అంటుంది.
“ తల్లీ నాకు నిజంగా నీ భర్త మరణించిన విషయం తెలియదు. అప్రయత్నంగా అలా ఆశీర్వదించాను. రాముడే నా నోట అలా పలికించి ఉండాలి. ఆ వాక్కులు వృథా కారాదు. నీవు వెళ్లి చనిపోయిన నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు. విశ్వాసంతో వెళ్ళు ” అంటారు. ఆమె అలాగే చేస్తే ఆమె భర్త బతికాడు.

11_002 – తెలుగు యాత్రా సాహిత్యం

వంద సంపుటాలకు పైబడ్డ మహాత్మాగాంధీ రచనల్లో మొట్టమొదటి రచన ఈ యాత్రాకథనమే. కాని ఆశ్చర్యం లేదు. ఎందుకంటే, ఒక మనిషి తన చల్లని ఇంటిపట్టు వదిలిపెట్టి కొత్త జీవితాన్ని వెతుక్కుంటూ, అనిశ్చయాలకు ఎదురేగే ప్రతి యాత్రా అతణ్ణి స్వాప్నికుడిగానో, సాహసిగానో మారుస్తుంది.