Teacher

13_005 పరాశర్ – కథక్ కళాకారుడు

అమెరికాలో నివసిస్తున్న తెలుగు యువకుడు పరాశర్ వయసు 15 సంవత్సరాలు. కథక్ నృత్య గురువు శ్రీమతి స్వాతి సిన్హా వద్ద చిన్న వయసు నుంచే కథక్ నాట్యం అభ్యసించడం ప్రారంభించాడు. పరాశర్ తల్లి తల్లి శ్రీమతి ఆత్మకూరి సంధ్యశ్రీ కూడా భరతనాట్య కళాకారిణి. అమెరికా లోని మిషిగన్ స్టేట్, రిసెప్టర్ లో నాట్య ధర్మి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే పేరుతో భరతనాట్య పాఠశాల నిర్వహిస్తున్నారు.

11_004 సప్తపర్ణి కథలు – ఆవాహన

నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. నువ్వు పరిగెడితే నీకు చెమట పడుతుంది.
సృష్టి లో ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు విను. భారత దేశం లో విశ్వాసం, భక్తి, నమ్మకం, గౌరవం
అన్నీ రక్త గతం గా ఉంటాయి. ప్రతీ జీవ కణం లోను ప్రతిస్పందిస్తూ ఉంటాయి.
మంత్రం మన లోపలి ప్రపంచాన్ని ఏ విధం గా పరిరక్షించుకోవాలో చెప్తుంది
తంత్రం భౌతిక ప్రపంచాన్ని మనకనుగుణం గా ఎలా మలచుకోవాలో తెలియచేస్తుంది.

11_002 కథావీధి – అనుక్షణికం5

చారుమతి టెంపరరీ టీచర్ వేకెన్సీ ని పెర్మనెంట్ చెయ్యడానికి ఎవరో అడ్డు పడగా, తండ్రి సలహా మేరకు సంబంధిత డిపార్ట్మెంట్ లోని ఒక నిజాయితీపరుడైన అధికారిని కలుసుకోవడానికి ఒక సాయంత్రం వెళ్ళగా ఆ ఇంటి ముందు లాన్ లో మల్లె అంట్ల మధ్యలో కూర్చొని టేప్ రికార్డర్ లో బాలమురళి సంగీత ఆస్వాదన చేస్తున్న స్వప్న రాగలీన చారుమతి ని గుర్తు పట్టి సాదరం గా ఆహ్వానించి వచ్చిన పని కనుక్కుని బాబాయి కాంప్ కి వెళ్ళారనీ, చారుమతి కేసు జన్యువిన్ అయితే ఎవరి రికమండేషనూ అవసరం ఉందని ధైర్యం చెప్పి పంపుతుంది.