Telugu

11_004 ఆనందవిహారి

చెన్నై, అమరజీవి స్మారక సమితి ఆధ్వర్యంలో ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా దసరా ప్రత్యేక కార్యక్రమం “ స్వర నవరాత్రి ” విశేషాలు……..

11_004 కూచింత కాఫీ

చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన కాఫీ హాస్య, వ్యంగ్య గుళికలు…… కొన్ని…

11_004 హాస్యగుళికలు – భామా కలాపం

అందరిళ్ళలోలా కాకుండా రామారావు గారింట్లో మాత్రం అన్ని పండుగలు వేరేగా ఉంటాయి. ఉగాది పండుగైతే మరీ ప్రత్యేకం. ఆరోజు రామారావు గారి భార్య భద్ర పంతులుగారి పంచాంగ శ్రవణం బదులు తన పంచాంగం చదివేస్తుంది. ప్రొద్దున్నే లేచి మొదలెట్టేస్తుంది.

11_004 తో. లే. పి. – ఆర్టిస్ట్ వాట్స్

ఒక రచన చదివినా, ఒక చిత్రాన్ని చూసినా మనలో ఒక స్పందన కలగడం సహజం. అయితే, ఆ వెంటనే ఆ స్పందనను ఉత్తరరూపంలో ఆ రచయిత కు కానీ చిత్రకారునికి గానీ తెలియపరచడం పాఠకుని ప్రధమ కర్తవ్యం. అది అవతలివారికి కూడా స్ఫూర్తిని ఇస్తుంది. అనడం లో ఎట్టి సందేహానికి తావు లేదు.

11_004 సప్తపర్ణి కథలు – ఆవాహన

నువ్వు తింటే నీ ఆకలి తీరుతుంది. నువ్వు పరిగెడితే నీకు చెమట పడుతుంది.
సృష్టి లో ఎవరి అనుభూతి వారిది. ఇప్పుడు విను. భారత దేశం లో విశ్వాసం, భక్తి, నమ్మకం, గౌరవం
అన్నీ రక్త గతం గా ఉంటాయి. ప్రతీ జీవ కణం లోను ప్రతిస్పందిస్తూ ఉంటాయి.
మంత్రం మన లోపలి ప్రపంచాన్ని ఏ విధం గా పరిరక్షించుకోవాలో చెప్తుంది
తంత్రం భౌతిక ప్రపంచాన్ని మనకనుగుణం గా ఎలా మలచుకోవాలో తెలియచేస్తుంది.

11_004 కథావీధి – అనుక్షణికం6

వందల సంఖ్యలో వచ్చే ఏ పాత్ర ప్రవర్తన లోనూ రచయిత జోక్యం ఉండదు. సమకాలీన పరిస్థితులకు పాత్రల ప్రతిస్పందనే కథాంశం. కథాంశం వాస్తవ జగజ్జనితం. పాత్రల ప్రతిస్పందన సహజాతి సహజం. చదివిన వారికి, వాస్తవ ప్రపంచంలో కొందర్ని చూసినప్పుడు ‘ అనుక్షణికం ’ లోని పాత్రలు తలపుకు వస్తాయి.

11_004 సంపూర్ణమైన పండుగ – బతుకమ్మ పండుగ

కుంకుమలో, పూలలో, అక్షింతలలో పుట్టిన గౌరమ్మా అంటూ అన్నింటినీ కలిపి చెప్తూ, అన్ని కులాల పేర్లు కూడా చెప్తూ పాట పాడుతారు. అంటే, అందరూ కులమతాలను వీడి, వాటికి అతీతంగా కలసికట్టుగా ఈ పండుగను స్త్రీలు, పిల్లలు కలసి చేసుకుంటారని అర్థమవుతుంది.