India

13_009 ఆనందవిహారి

అమెరికాలో ఇల్లినాయిస్ లో శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( సప్నా ), వీణ గ్లోబల్ కౌన్సిల్ చికాగొ మరియు ఇండియా క్లాసికల్ మ్యూజిక్ సొసైటి ఐ‌సి‌ఎం‌ఎస్, ట్రినిటీ దత్త యోగా సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన 20వ వీణా మహోత్సవం విశేషాలు, కాలిఫోర్నియా లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారి 6వ స్నాతకోత్సవ విశేషాలు, ‘ శ్రీరస్తు ’ చిత్రం ప్రివ్యూ విశేషాలు…..

13_009 రాగయాత్ర – జానకి రమణా…

శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ), వీణా గ్లోబల్ కౌన్సిల్, చికాగో, ఇండియా క్లాసికల్ మ్యూజిక్ సొసైటి ( ICMS ), ట్రినిటీ దత్త యోగా సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన 20వ అంతర్జాతీయ వీణా ఉత్సవం నుంచి…. కర్ణాటక గాత్ర సంగీత కచేరీ, శ్రీకళాపూర్ణ బిరుదు సన్మాన ఉత్సవం
గాయకులు : ‘ గానరత్న ‘ తిరువారూర్ ఎస్. గిరీష్,
సహకారం : ‘ సంగీత కళానిధి, మృదంగ విద్వాన్ ‘ తిరువారూర్ భక్తవత్సలం, ‘ వాణి కళా సుధాకర ’ విద్వాన్ ఆర్. కె. శ్రీరామ్‌కుమార్, ‘ మృదంగ విద్వాన్ ’ సుబ్రమణ్యం కృష్ణమూర్తి

13_009 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 13

చెన్నమల్లేశ్వర స్వామిని సేవించి, ఆయనకు భక్తురాలై, ఆయన సేవలోనే జీవించి, ఆ దైవం లోనే ఐక్యమైన అక్కమహాదేవి కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లా ఊదుతాడి గ్రామంలో క్రీ. శ. 1130వ సంవత్సరంలో వీరశైవుల ఇంట జన్మించింది. బాల్యంలోనే చెన్నమల్లిఖార్జునుని తన భర్తగా స్వీకరించి, ఆయన భావనలోనే కాలం గడిపేది. అప్పట్లో జైన మతవాలంబుడైన ఆ దేశాన్ని ఏలే రాజు కౌశికుడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై పెళ్లాడతానని కబురు చేశాడు. మొదట ఒప్పుకోకపోయినా తల్లిదండ్రులను, బంధువులను రాజు దాష్టీకన్నుంచి తప్పించడానికి తల ఒగ్గక తప్పలేదు.

13_008 రామచరిత మానస్

ఈ ఘట్టంలో సీతారాముల కల్యాణ సమయంలో ఆ వధూవరుల రూపవర్ణన, వారు ధరించిన విభిన్న ఆభూషణాల సహితంగా సీతారాముల వర్ణన, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల వర్ణన, ఆరోజు అందచేయబడిన విందు, బహుమతుల సహితంగా వర్ణించబడుతోంది.

13_008 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 12

ఎత్తైన, మెత్తని, చక్కని, చల్లని పూల సజ్జపై నీలదేవి కౌగిలిలో ఒదిగి వున్న మా స్వామీ కృష్ణయ్యా ! ఇలా నీ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నందుకు మన్నించు. మా విన్నపం ఆలకించి బదులు పలుకు…. అంటూ నీలదేవి కౌగిలిలో సోలి నిద్రించు స్వామిని మేలుకొలుపుతున్నది గోదా…..

13_007 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 11

మనమంతా ఎంత అదృష్టవంతులమో ! శ్రీలు పొంగిన రేపల్లె మన జన్మస్థలమైంది. ఓ నెచ్చెలులారా ! నిండు జవ్వనులారా !
కంసుని భయంతో వేలాయుధం చేత ధరించి రాత్రింబవళ్ళు నందరాజు తన ముద్దులయ్యను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. ఆ నల్లనయ్య యశోదాదేవి ఒడిలో కొదమసింగంలా ఆడుకుంటున్నాడు మనోజ్ఞంగా….. ఇలా గోదాదేవి పాశురాల విశేషాలను వివరిస్తున్నారు.

13_005 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 10

దక్షిణ భారతదేశంలో ప్రభవించిన వాగ్గేయకారులలో ముఖ్యంగా మహిళా వాగ్గేయకారులలో ముఖ్యంగా చెప్పుకోదగిన పేరు గోదాదేవి. ఆమెకే ఆముక్తమాల్యద అనే పేరు కూడా ఉంది. శ్రీరంగం పట్టణానికి చెందిన గొప్ప విష్ణుభక్తుడు విష్ణుచిత్తుని కుమార్తె ఈమె. సీతాదేవి వలెనే ఈమె కూడా అయోనిజ. విష్ణుచిత్తుడు ఒకరోజు ఎప్పటిలాగే విష్ణు కైంకర్యానికి మాలలకోసం తులసి వనానికి వెళ్ళినపుడు అక్కడ దొరుకుతుంది. భగవత్ప్రసాదం గా భావించి ఇంటికి తెచ్చుకొని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆ దంపతులు. విష్ణుసేవలో ఎదిగిన గోదాదేవి రోజుకొకటి చొప్పున ముఫ్ఫై రోజులపాటు గానం చేసిన పాశురాలన్నిటినీ కలిపి ‘ తిరుప్పావై ’ అంటారు. ఈ విశేషాలను వివరిస్తున్నారు.

13_002 ద్విభాషితాలు – పేద

ప్రకృతి ఒడిలో విభిన్న సౌందర్యాలు…. మనిషి ఆనందం కోసమేనన్న సత్యాన్ని విస్మరించి…. యాంత్రికంగా జీవిస్తున్న మనిషి తీరు ఈ కవితకు ప్రేరణ.

13_002 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 08

అనాది నుండి పరమేశ్వరుడు స్వయంగా మెచ్చి కొలువున్న పట్టణం వారణాశి. సంగీత, సాహిత్య, ఆథ్యాత్మిక త్రివేణీ సంగమ స్థలం. జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని భావించే ప్రతి ఒక్కరూ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వర దేవుని దర్శించుకోవాలని తలపోస్తూ వుంటారు. అటువంటి కాశీ వాసులైన కొందరు భక్తుల గురించి చెప్పుకుందాం. భక్త కబీరు గురించి, ఆయన జీవిత విశేషాల గురించి చెప్పుకుందాం. ఎంతవరకు నిజమో తెలియదు గాని కబీరు దాస్ పుట్టుక గురించి ఒక అలౌకికమైన కథ ప్రచారంలో ఉంది. అది…..