10_011

10_011 ఆనందవిహారి

శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) వారు నిర్వహించిన శ్రీ యు.ఏ.ఎన్ మూర్తి స్మారక 3వ రచనల పోటీ” ఫలితాలు

10_011 ‘కోట’కోసం అయిసరబజ్జా…

ఇక ఉన్న ఆ ఏకైక వస్తువు, గిరిజ చూపించింది,
వాళ్ళకు గుండె గుభిల్లుమంది. “ఇంత పెద్ద తొట్టిని ఎట్లాగ మొయ్యాలి!?”
“తొట్టి కాదు, తులసి కోట – అనాలి.” ఆమెతో పాటు, వాళ్ళున్నూ భయభక్తులతో చెంపలు వేసుకుని
“ఇప్పుడెట్లా!” అని తర్జనభర్జనలు పడ్డాక,
“మనమే తిప్పలు పడదాము. తప్పుతుందా!?” అనుకుని, ధైర్యం తెచ్చుకున్నారు.

10_011 గతకాలము మేలు

అప్పట్లో ఎంత బాగుండేది !! పిల్లలు తమిద్దర్ని వాళ్ళ దగ్గర కి పిలిపించుకుని విదేశాల్లో వింతలన్ని చూపించి పంపారు ఆ విశేషాలు అన్నీ తను టీ కొట్టు వద్ద, జిలేబీ సెంటర్ వద్ద, పునుకుల బండి వద్ద ఎక్కడ పడితే అక్కడ తన కాలనీ ఫ్రెండ్స్ తో చెబుతుంటే వాళ్ల ముఖాల్లో మెరుపులు, అవీ చూసి తాను కొనిచ్చిన జిలేబీ లూ బజ్జీలు తింటూ ఆనందించే వారితో ఎంత హాయిగా ఉండేది .. అలాంటి జీవితం లో ఒక్కసారిగా ఈ మార్పు…

10_011 తో.లే.పి. – డా. కె. ఎస్. సుబ్బరామప్ప

సాహిత్యం, సంగీతం అంటే సాహితీ గోష్టులు, సంగీత కార్యక్రమాలు, నాటకాలు ఇలా వాటిలో తరచుగా పాల్గొంటూ ఉండడం.. పుస్తకాలను విరివిగా చదువుతూ పఠనాసక్తి ని పెంపొందించుకుంటూ ఉండడం.
ఇదుగో.. అలాంటి ఒక సందర్భం లో నా అభిమాన గ్రంథాలలో ఒకటైన శ్రీకృష్ణదేవరాయ విరచిత ఆముక్త మాల్యద ను గురించి వినడం జరిగింది. దీని వెనుక ప్రేరణను కలిగించిన మహానుభావులు ఎవరంటే….

10_011 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – రిటైర్డ్ హస్బండ్

ఇన్నేళ్ళు ఉద్యోగం…ఉద్యోగం….అంటూ ఇల్లు వాకిలీ పట్టకుండా ఏం చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవారు. ఉన్నట్టుండి ఇప్పుడు తగుదునమ్మా అంటూ అన్నింట్లో వేళ్ళు పెడుతున్నారు! ఇన్నేళ్లొచ్చినా ఎప్పుడు ఏ పని చెయ్యాలో తెలీదు. మొన్నటికి మొన్న ఓ పక్క వియ్యాల వారు వచ్చే టైం అయిందని నేను గాబరా పడిపోతుంటే, మీరు గుట్టుచప్పుడు కాకుండా అటకెక్కి కూర్చున్నారు.

10_011 కథావీధి – రావిశాస్త్రి రచనలు 7

మొత్తంగా వీరి రచనా వ్యాసంగాన్ని పరిశీలిస్తే తొలినాళ్ళలో పంజరం లో చిలక, రైలు ప్రయాణం, పోరుపడలేక లాంటి సీదా సాదా కథలు రాసి మంచికథలు రాయలేనేమోనన్న సంశయం తో రచనా వ్యాసంగానికి తాత్కాలికం గా స్వస్తి చెప్పి, సతీమణి ప్రోత్సాహం తో మళ్ళీ రచనా వ్యాసంగానికి శ్రీకారం చుట్టిన వీరు కొన్ని మారు పేర్ల తో కథలు రాసారు. సుప్రసిద్ధ రచన అల్పజీవిని అయ్యరే బాబారే పేరు తో రాయగా భారతి లో ప్రచురించబడి విశేషం గా ఆదరణ పొందింది.

10_011 పాలంగి కథలు – ప్రియమైన శ్రీవారికి…

మన పెళ్లయ్యాక ఎంఏ రెండో సంవత్సరం మీరూ, డిగ్రీ చివరి సంవత్సరం పూర్తి చెయ్యడానికి మా పుట్టింట్లో నేనూ ఉన్నప్పుడు తెలుగు సాహిత్యం ఎంతల్లా చదివేవారమో గుర్తుందా? ఉత్తరాల్లో పేజీలకి పేజీలు చెప్పుకునే వారం వాటిగురించి. మధ్యలో అన్నీ అటకెక్కాయ్‌. పోన్లెండి, కానీ ఇప్పుడు మళ్లీ కలిసి కావ్యాలు చదువుదాం. పోతన భాగవతం చాలా బాగుంటుంది. వీలైనప్పుడల్లా చదువుదాం. భారతం, భగవద్గీతలు మీకు ఆసక్తి ఉంటే చదవొచ్చు.

10_011 వాగ్గేయకారులు – జయదేవకవి

ఈ రూపకంలో రాధ అష్టపదులను నేను పాడగా, శ్రీకృష్ణుని పాటలను కీ.శే. రామకృష్ణ చందేశ్రీ, సూత్రధారిగా కీ.శే. శ్రీ జగదీశ్ సింగ్ ఠాకూర్, సఖియలుగా శ్రీమతులు సురేఖా కోర్డే, జయశ్రీ తట్టే, కుసుమ్ బడోద్కర్ ఆలపించారు. దీనికి సంగీతాన్ని సమకూర్చింది నేను ( అసిస్టెంట్ ప్రొడ్యూసర్/సంగీత రచన ), కీ. శే. బిరాజ్ భూషణ్ బసు, శ్రీ రామకృష్ణ చందెశ్రీ. ఈ సంగీత రూపకాన్ని గురించి అన్ని ఇంగ్లీష్ వార్తా పత్రికలూ ఎంతో కొనియాడాయి. దీని విజయం తరువాత, ఏటా జరిగే కాళిదాస్ మహా సమారోహ్ లో కూడా ఇది ఆకాశవాణి కళాకారులచే మళ్ళీ ప్రదర్శించబడింది.