10_020

10_020 ఆనందవిహారి

చెన్నైలో ‘ స్వరార్ణవ ’ సంగీత బృందం ఆధ్వర్యంలో అంతర్జాలంలో “లలితమ్మ భజన ” సీడీ ఆవిష్కరణ కార్యక్రమ విశేషాలు, అంతర్జాలంలో “సర్వం విష్ణుమయం” సీడీ ఆవిష్కరణ కార్యక్రమ విశేషాలు, అమరజీవి స్మారక సమితి నిర్వహించే ‘ నెల నెలా వెన్నెల “ కార్యక్రమంలో భాగంగా మహిళలపై జరిగే దాడులు, నివారణ చర్యలు ” కార్యక్రమ విశేషాలు….

10_020 ‘ గాన రత్న ’ కుమారుడు – నివాళి

గాత్ర మాధుర్యం ఉన్నా, తన ఆసక్తి ఉన్న రంగం లో అడుగు పెట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. తెలుగు, తదితర దక్షిణాది భాషలలో నిర్మితమైన అనేక చలన చిత్రాలలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థల చేత ఈ రంగం లో ఎన్నో పురస్కారాలను, ప్రశంసలను అందుకున్నాడు.

10_020 నా స్టేటస్ చూడు

రోజు రోజుకి చారుమతి, కొత్త స్టేటస్ ఫోటోల కోసం వెర్రిత్తిపోతోంది. ఏది చూస్తే అది స్టేటస్ ఫోటో లా అప్‌లోడ్ చేయడం మొదలుపెట్టింది. ఇలా చారుమతి స్టేటస్ పిచ్చి వల్ల ముకుందానికి మనశ్శాంతి కరువయ్యింది..ఏదోవిధంగా చారుమతిని స్టేటస్ పిచ్చి నుంచి తప్పించాలని ఆలోచించాడు.

10_020 బోట్స్‌వానా లో వజ్రాలు

పెద్ద పెళ్ల నేలనుంచి విడివడిందా అన్నట్లుగా తోస్తుంది. పెద్ద ట్రాక్టర్లు, బుల్డోజర్లు భూమిని తవ్వుకుంటూ పోతుంటాయి. ఈ త్రవ్విన మట్టిని ఆ గోతుల నుంచి ఎత్తుతుంటాయి. కన్వేయర్ బెల్టుల ద్వారా ఈ మట్టిని జల్లించి కడిగి శుభ్రపరుస్తారు మిషన్ల ద్వారా. అందులో నుంచి విలువైన వజ్రాలు కనుక్కుంటారు. వాటిని సైజ్ ల వారీగా ఏరి విలువలు నిర్ణయిస్తారు. 1967 లో కనుగొన్న ఈ సంపద పెరుగుతూనే ఉంది.

10-020 ద్విభాషితాలు – నాన్న ఉత్తరం

వేసవి వెనుక వర్షం దాగి ఉన్నట్లు..
కష్టాన్ని వెన్నంటి సుఖం ఉంటుంది. ఓర్పుతో వేచి ఉండాలి.
ప్రలోభాలు ప్రఛండమైనప్పుడు.. విలువలు బీటలు వారకుండా.. జాగ్రత్త పడాలి.
సవాళ్లు ఎదురైనప్పుడు..
ధైర్యమే ఆయుధం!

10_020 తో. లే. పి. – ఓలేటి వెంకటరత్నం

నిజానికి ఎవరి జీవితాన్నైనా మొదటి నుండి తీర్చిదిద్దేవారు వారి తల్లిదండ్రులే. ఇది తిరుగులేని సత్యం. అందువలననే ఆది గురువులు తల్లిదండ్రులే అంటారు మన పెద్దలు…
జీవితం అంటే అసలు ఏ మాత్రం అవగాహన లేని వయసులో దానికి ఒక ఒరవడిని దిద్ది, దానిని సక్రమమైన పంధాలో నడిపించే తల్లిదండ్రులకు మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.

10_020 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – తెలుగు టీవీ

పదార్ధాల పేరుకూడా సరిగ్గా పలకడం రాని ఓ పాకశాస్త్ర ప్రవీణురాలు చెప్తుంటే విన్నాను, స్వీటులో చివరికి ఎలకల పొడి చల్లితే వాసనతోపాటు రుచి రెట్టింపవుతుందని! రుచిమాట ఏమోగాని తిన్నావాడెవడో ఠపీమని చావడం మాత్రం ఖాయం! సరే ఇవన్నీ నచ్చకపోతే హాయిగా భక్తి ప్రోగ్రాములు చూసుకోవచ్చు కదా అంటారా?

10_020 పాలంగి కథలు – పండుగ వేళ….

మట్టిని hate చేయకూడదు తెలుసా? ఆ మట్టి లోంచే great grand pa ధాన్యం, కూరలు, పళ్లూ పండిస్తున్నారు. వాటినే కదా మనం తింటున్నాం? అలాంటి నేలను నువ్వు హేట్‌ చేస్తున్నట్టు తెలిస్తే బాధపడతారు కదా! సో…మనం భూమాతకు దణ్ణం పెట్టాలి. పొలం వెళ్లి ‘ ఇది మా పొలం. ఈ భూమాత మా motherland. mother earth will gives us శక్తి, ’ అని gratitude తో నమస్కారం చేయాలి తెలిసిందా? కాలికి మట్టి అయితే wash చేస్తే పోతుంది కదా!

10_020 కథావీధి – వడ్డెర చండీదాస్ రచనలు 04 – అనుక్షణికం

కొందరు సాహితీ విమర్శకులు ఈ పుస్తకానికి టాల్ స్టాయి గారి ‘ వార్ అండ్ పీస్ ’ అనే ఉద్గ్రంధం తో సాపత్యం తెచ్చారు. ఆ గ్రంధం తో వీరికి ఎంతవరకూ పరిచయం ఉందో మనకి తెలవదు కానీ సాధారణంగా పర భాషా గ్రంథాలని చదివి అందులో రచయిత ప్రతిపాదించదలుచుకున్న తత్వాన్ని పట్టుకోవడానికి మనకి ఆ భాషలో ఉన్న పరిజ్ఞానం ఒక ప్రధానమైన పరిమితి అవుతుంది.