10_021

10_021 వార్తావళి

బే ఏరియా తెలుగు సంఘం వారి ‘ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ’, తానా వారి పాఠశాల వేసవి శిబిరం, యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి ‘ ఇండియన్ ఆర్ట్ & లాంగ్వేజెస్ ’ గురించి వెబినైర్ కార్యక్రమాల వివరాలు…

10_021 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి నిర్వహించే ‘ నెల నెలా వెన్నెల “ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నృత్య కళాకారిణి, రచయిత్రి శ్రీమతి రాగసుధ వింజమూరి గారి “ నృత్యం – వైవిధ్యం ” పై ప్రసంగ కార్యక్రమ విశేషాలు….

10_021 తిరుమలగిరి రాయ

తిరుమలగిరి రాయ…
– అన్నమాచార్య కీర్తన ఆకాశవాణి ‘ బి ‘ హై గ్రేడ్ కళాకారిణి నీరజ గళంలో

10_021 మేము చూసిన యూరోప్ దేశాలు

పెద్ద పెళ్ల నేలనుంచి విడివడిందా అన్నట్లుగా తోస్తుంది. పెద్ద ట్రాక్టర్లు, బుల్డోజర్లు భూమిని తవ్వుకుంటూ పోతుంటాయి. ఈ త్రవ్విన మట్టిని ఆ గోతుల నుంచి ఎత్తుతుంటాయి. కన్వేయర్ బెల్టుల ద్వారా ఈ మట్టిని జల్లించి కడిగి శుభ్రపరుస్తారు మిషన్ల ద్వారా. అందులో నుంచి విలువైన వజ్రాలు కనుక్కుంటారు. వాటిని సైజ్ ల వారీగా ఏరి విలువలు నిర్ణయిస్తారు. 1967 లో కనుగొన్న ఈ సంపద పెరుగుతూనే ఉంది.

10_021 తో. లే. పి. – ఆర్. ఎస్. కున్నయ్య

ఆ రోజుల్లో ప్రత్యేకించి, మద్రాసు నగరం దక్షిణాది భాషల చలనచిత్రాలకు పుట్టినిల్లు అని చెప్పవచ్చును. నటీనటులతోనూ, రచన, సంగీతము, సినీ నిర్మాణానికి సంబంధించిన తదితర శాఖలకు చెందిన వివిధ కళాకారులతోనూ నగరమంతా ఎప్పుడూ కళకళలాడుతూ ఎంతో శోభాయమానంగా ఉండేది. సినీ ప్రేక్షకులకూ, నటీనటులు తదితర కళాకారులకూ మధ్య ఎంతో సయోధ్య ఉండేది. దీని వెనుక ముఖ్య పాత్ర Film Fans Association ది అన్నమాట!

10_021 పాలంగి కథలు – నాటి సుధాప్రాయపు రోజులు

పెళ్లివారు గుమ్మంలోకి రాగానే అక్క కుంకమ కలిపిన నీళ్లు దిగదుడిచి పోసింది పెళ్లికూతురుకి, పెళ్లికొడుక్కి. వాళ్లందరూ లోపలికొచ్చి పెరట్లో ఉన్న పెద్ద సపోటా చెట్టు కింద పరిచిన గడ్డి మీద ఉంచారు పల్లకీ. అందరికీ పెళ్లి భోజనాలు సిద్ధం. అంతకుముందే అవధాని మేస్టారు వాళ్లావిడ పెళ్లి విందుకి అన్ని ఏర్పాట్లూ తానే చేస్తానందట. నిజానికి ఈ పెళ్లికి వారంరోజుల నుంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోజూ రాత్రులు పెరట్లో తులసికోట దగ్గర సమావేశమై చర్చలు చేస్తున్నారు.

10_021 కథావీధి – వడ్డెర చండీదాస్ రచనలు 05 – అనుక్షణికం 2

కొందరు సాహితీ విమర్శకులు ఈ పుస్తకానికి టాల్ స్టాయి గారి ‘ వార్ అండ్ పీస్ ’ అనే ఉద్గ్రంధం తో సాపత్యం తెచ్చారు. ఆ గ్రంధం తో వీరికి ఎంతవరకూ పరిచయం ఉందో మనకి తెలవదు కానీ సాధారణంగా పర భాషా గ్రంథాలని చదివి అందులో రచయిత ప్రతిపాదించదలుచుకున్న తత్వాన్ని పట్టుకోవడానికి మనకి ఆ భాషలో ఉన్న పరిజ్ఞానం ఒక ప్రధానమైన పరిమితి అవుతుంది.