11_002 ద్విభాషితాలు – రక్షాబంధన్

.

అన్నా !

అమ్మా నాన్నల ప్రేమకు..

మరో రూపమైన నిన్ను..

సదా మనసులో కొలుచుకొంటాను.

.

నేను చేసే జీవనగమనంలో..

ఆనందానుభూతులసుధలు..

వర్షించినప్పుడు..

అందులో నీ పాత్రను

సదా స్మరించుకొంటాను.

.

పాదాలు వణికి..

అడుగు తడబడినప్పుడు..

మనోస్థైర్యం కోసం…

నీ అడుగును తోడు అడుగుతాను.

.

అప్పుడప్పుడూ పైనబడే..

అలజడుల అశనిపాతాలు…

తట్టుకొని నిలబడడానికి..

నీ నీడలో సేద తీరుతాను.

.

వెన్నెలను… వేసవిని పంచుకొంటూ

భుజం తట్టి ముందుకు నడిపిస్తూ.. నన్ను రక్షించే గొప్ప శక్తిగా… స్నేహితునిగా…

నిన్ను గుర్తించిన

నా ప్రేమకు సంకేతమే

నేడు…

నీ చేతికి నేను కడుతున్న..

ఈ రక్షాబంధనం!

.

———(O)———