11_013AV

11_013AV వార్తావళి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారు నిర్వహిస్తున్న ‘ మాలతీచందూర్ సాహితీ పరిశోధన పురస్కారం ’, ఏ‌.ఐ‌.ఏ. (AIA) హోలీ సంబరాలు, బే ఏరియా తెలుగు సంఘం (BATA) వారి ఉగాది సంబరాలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( NATS) వారి మినీ తెలుగు సంబరాలు, అమరజీవి స్మారక సమితి వారి నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక ఉపన్యాసం “ పాలగుమ్మి పద్మరాజు – ఒక స్పూర్తి ”, హైదరాబాద్ లో 7వ త్యాగరాజ ఆరాధన వివరాలు….

11_013AV పెళ్ళికి రండి – ఈ పెళ్లి విందు మాట…

జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి……

11_013AV ఇన్ని చదువనేల…

పుట్టెడిదొకటే పోయెడిదొకటే | తిట్టమై రెంటికిని దేహమే గురియౌను |
పుట్టుట సంశయము పోవుట నిశ్చయము | వొట్టి విజ్ఞానులకు వుపమిది వొకటే ||

11_013AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 06

నాయికా నాయక భావం తో రంగస్థలం మీద సాగే నృత్య సంగీత సంయోగం నాట్యం. నాయికా నాయకుల శృంగార నాట్య సంయోగం రసానుభూతిని కలిగిస్తుంది. అన్నమాచార్య పరమ మనోహరం గా ఈ అంశాన్ని తన సంకీర్తనలతో ఆవిష్కరించాడు.
కేవలం గానం చేత, భావన చేత, నాట్యం చేత భావుకులకి, శ్రోతలకి, ప్రేక్షకులకి రసానందం సిద్ధిస్తుంది.

11_013AV రమ్మనవే,,,

పెనగుచు బలుమారు పెచ్చుపెరిగీ దాను | గునిసి పరులమీద కోపగించీని |
వెనుకొని నీ జాడలే వెదకీ నితడు నేడు | మనసుమర్మాలు చూడమచ్చిక సేసీని ||

11_013AV ఆంగికం భువనం…

మొత్తం విశ్వంలో భావ ప్రకటనకు అనువైన శరీరం, విశ్వవ్యాప్తమైన శబ్దం కలిగిన పలుకు, తారాచంద్రులనే ఆభరణాలుగా కలిగిన ఆ శివునికి నమస్కరించుచున్నాను.

11_013AV అంతయు నీవే….

కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధర నా నెలవును నీవే నీరజనాభ