Soil

13_008 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా మార్చి కార్యక్రమం “ చెన్నపురిలో తెలుగు సేవకు చిరకాల చిరునామా అమరజీవి స్మారక భవనం ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు,

13_007 చిన్ననాటి జ్ఞాపకాలు

1949 వ సంవత్సరంలో పెద్ద ఉప్పెన గాలి వచ్చింది. అంటే తుఫాను లాంటిది. మా ఇల్లు పెద్ద మండువా ఇల్లు. ఇల్లు రోడ్డు కంటే పల్లముగా ఉండడంవల్ల ఇంటిలోకి నీళ్ళు వచ్చాయి. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత ఇంట్లోనుండి బయటకు వెళ్లి చూస్తే, మా చిన్నాన్న గారి ఇంటిలో నారింజ చెట్టు పడిపోయింది. కాయలన్నీ రాలిపోయాయి.
చెరువు గట్టు వైపు చూస్తే, చెట్ల కొమ్మలు విరిగి నేల మీద పడి ఉన్నాయి. కాకులు గుట్టలుగా చచ్చిపడి ఉన్నాయి. ఎన్నో జంతువులు చచ్చిపోయాయి.

13_006 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జనవరి కార్యక్రమం “ మట్టిబండి – రచనా వైశిష్ట్యం ” ప్రసంగ కార్యక్రమ విశేషాలు, తణుకు లో జరిగిన “ 85వ త్యాగరాజ ఆరాధన సంగీత ఉత్సవములు ” కార్యక్రమ విశేషాలు……

12_012 సాక్షాత్కారము 03

తే. గీ. ఎండవానలలోన తా మెండి తడిసి
శ్రితుల నీడ నిచ్చి సమాదరించుతరులు ;
తమఫలమ్ముల నొకటియున్ తాము తినక
పరులకై దాన మొనరించుతరులు ఋషులు !

12_011 సాక్షాత్కారము 02

తే. గీ. ఆకలింగొన్నవారికి అన్నపూర్ణ
యైన దిచట డొక్కాసీతమాంబ ! ఆమె
పుట్టువుం గన్నయీపుణ్యభూమిలోన
భళిర ! క్షుద్బాధతో ౘచ్చువాఁడు లేఁడు!