May 15, 2021

10_018 బాలభారతి-తేనెటీగలు

పూలగుండె నొప్పింపక తేనెలు
పుణికి పుణికి తీసుకు వస్తాయి !
ఉన్నవారికడ తెచ్చిన దంతా
లేనివారికే పంచేస్తాయి !

10_018 వాగ్గేయకారులు-మైసూర్ సదాశివరావు

తమ శిష్యులకు తామే గొప్ప సంగీతజ్ఞులమనే గర్వం ఉండరాదని సతతం హెచ్చరిస్తూ ఉండేవారు. ఏ సంగీతమూ తక్కువకాదనీ, ఎలా పాడేవారినైనా కించపరచరాదని బోధించేవారట. వీరు చాలా ఆచారవంతులు. లక్ష్మీనరసింహులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవారట. వీరికి ఏ గురువూ లేరనీ, కేవలం దైవకృప వల్లనే సంగీతం అబ్బిందనీ కొందరు అభిప్రాయం పడుతూ ఉంటారు.

10_018 వేదార్థం – అగ్నిసూక్తం 3

సృష్టిలో మూడు అగ్నులు ఉన్నాయి. మన శరీరంలో మూడు అగ్నులు ఉన్నాయి. అందుకే మన ఇంటి యందు కూడా మూడు అగ్నులను పెడతారు. యజ్ఞశాలలో మూడు అగ్నులు ఉంటాయి. సృష్టిలో సూర్యుడు ఒక అగ్ని. విద్యుత్ ఒక అగ్ని. భూమి మీద ఉండేది ఒక అగ్ని. మన శరీరంలో కూడా మన మెదడు ఒక అగ్ని, మనం తీసుకున్న ఆహారాన్ని పచనం చేసే అగ్ని మరొకటి, సంతానోత్పత్తి కి కారణమైన అగ్ని ఇంకొకటి…… “ అగ్నిమీళే పురోహితమ్……” అనే వేద శ్లోకానికి పూర్తి అర్థం, వివరిస్తూ ఈ త్రేతాగ్నుల గురించి…..
వేదముల గురించి, వాటిలోని అంతరార్థం గురించి మరిన్ని విశేషాలు….