June 2021

10_019 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – కోవిడ్‌లో ప్రయాణం

ఇండియాకు ఈ టైములో వచ్చినందుకు అందరూ నన్ను కోప్పడినా, వెళ్లినందుకు నాకు మాత్రం చాలా తృప్తిగా ఉందండి! కోవిడ్ కారణంగా ఈమధ్య అందరికీ పిల్లల్తో గడిపే అవకాశం దొరికినట్లు, నాక్కూడా చాలా కాలం తర్వాత అచ్చంగా అమ్మావాళ్ళతో గడిపే అవకాశం దొరికింది. ఎక్కడికీ వెళ్ళకుండా ఇంటిపట్టునే ఉన్న నన్ను చూసి తొంభై ఏళ్ళ నాన్న ఎంత ఆనందపడ్డారో చెప్పలేను!

10_019 పాలంగి కథలు – దశాబ్దాల నిర్వాణ భావం

కోడలితనం సాగుతూనే ఉంది. ఆడబడుచుల పెళ్లిళ్లూ…వాళ్ల పురుళ్లూ, పుణ్యాలూ!! వాళ్ల పిల్లల, నా పిల్లల చదువులూ…ఊపిరి సలపకుండా గడిచిపోతోంది కాలం. ఇప్పుడిహ అమ్మా నాన్న కూడా లేరుగా! వదిలేస్తే వెళ్లడానికి!! ఎక్కడికెళ్తానూ…ఇంకెక్కడికెళ్లాలి కనుక!! పాపం! ఏమాటకామాటే చెప్పుకోవాలి! నిజానికి వదిలేస్తానని నోటితో ఎప్పుడూ అనలేదు!

10_019 కథావీధి – వడ్డెర చండీదాస్ రచనలు 03

వ్యక్తులుగా ఈ పుస్తకం లోని పాత్రలు ఉన్నతులు, ఉదాత్త స్వభావులు. పాత్రల ద్వారా రచయిత ప్రతిపాదించిన అభిప్రాయాలూ ఉత్తమ స్థాయి లోనే ఉంటాయి. అయినప్పటికీ ఈ పరిస్థితి.

అందుచేతనే పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ పుస్తకం లోని శైలీ విన్యాసాల ను ఇత్తడి చెంబు కి మెరుగులు పెట్టడం తో పోల్చారు. ఒక రచయిత ప్రతిపాదించిన కథాంశం సమాజానికి హితం చేసేది గా లేనప్పుడు ఆ కథారచన లో రచయిత ప్రదర్శించిన శైలీ విన్యాసాలు నిరుపయోగం అని వారి భావం.

10_019 వాగ్గేయకారులు – వెంకటముఖి

వెంకటముఖి విరచిత ‘ చతుర్దండి ప్రకాశిక ’ కర్ణాటక సంగీతంలో ఒక మైలురాయి అంటే అతిశయోక్తి కాదు. 20వ శతాబ్దంలో అచ్చువేయించే దాకా, ఇది కేవలం వ్రాతప్రతి రూపంగానే ప్రాచుర్యంలో ఉంటూ వచ్చింది. స్వర స్థానాల, వాటి పౌనఃపున్యం పైనా ఆదరించి మేళకర్త రాగాలకు ఒక వైజ్ఞానిక వ్యవస్థాత్మక వర్గీకరణను అందచేసిన ఏకైక సంగీత గ్రంథం ఇది.

10_019 ఆత్మీయ సుమాంజలి

డా. శ్రీనివాసరావు గారి నిష్క్రమణ “ శిరాకదంబం ” పత్రికకు తీరని లోటు. సౌజన్యమూర్తిని, మార్గదర్శకుని, శ్రేయోభిలాషిని పత్రిక కోల్పోయింది. వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి ప్రవచనాల ద్వారా ఎప్పటికీ “ శిరాకదంబం ” మా గుండెల్లో, మా పాఠకుల / వీక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. వారికి ఉత్తమ గతులు ప్రాప్తించాలని కోరుకుంటూ….