August 2021

11_001 నిత్య చైతన్యమూర్తి అప్పలాచార్య

Nityachaitanyamoorti Appalacharya
తెలుగు దేశానికి తలమానికం లాంటి ఈ మహానగరంలో తెలుగు వాడు గానీ, తెలుగుదనం గానీ, తెలుగు అక్షరం గానీ కనిపించలేదని బాధపడ్డాను. తెలుగు తల్లిని సగానికి చీల్చి బొట్టు, తాళీ తీసివేసి, ముసుగు వేసి, ఉర్దు మాట్లాడమని హింసిస్తున్నట్లుంది నాకు. ఈ దౌర్జన్యాన్ని, ఈ క్రౌర్యాన్ని తెలంగాణలోని కోటి తెలుగువాళ్లు ఎలా సహిస్తున్నారా అనిపించిందా క్షణంలో…. ” చెబుతున్న ఆయన కళ్ళు తడిబారాయి.

10_022 వార్తావళి

అమెరికా లోని నాట్స్ వారి ‘ సూపర్ బ్రైన్ వర్క్ షాప్, తానా వారి పాఠశాల వేసవి శిబిరం, యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి ‘ రన్ ఫర్ తెలుగు ’, చెన్నై అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ‘ లో భాగంగా “ దక్షిణ తమిళనాడు – తెలుగు సంస్థానాలు ” మొదలైన కార్యక్రమాల వివరాలు…

10_022 పుష్కర గోదావరమ్మ ఒడిలో…

‘ ఈ కాలం పిల్లలకు ఈ ఆటలేవీ తెలియవు. ప్రస్తుతం నడుస్తున్నది టెక్నాలజీ యుగం. అప్పటి బాల్యం స్వేచ్ఛావిహారం. బండెడు పుస్తకాల బరువు లేదు. హోంవర్కుల బెడద లేదు. ఆడుతూ పాడుతూ చదువులు. సుమతీ శతకం, వేమన శతకం అమ్మ వంట చేస్తూ వల్లెవేయించేది. ’ బాల్య స్మృతులు తలచుకొని మురిసిపోయింది గౌతమి.

10_022 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – శ్రావణమాసం స్పెషల్

వంటలకు…డాన్సులకు సంబంధం ఏమిటీ అంటారా?
ఏం చచ్చు ప్రశ్న అండీ బాబు! ఏ కాలం లో ఉన్నారు మీరు? అందుకే తెలుగు ఛానల్స్ చూడండీ. కాస్త తెలివి పెరుగుతుందీ అంటే వినిపించుకోరాయే. అస్తమానం హిస్టరీ ఛానల్సు…ట్రావెల్ ఛానల్సు….ఈ రెండు కాకపొతే న్యూస్ ఛానల్ చూసే మీకు లోకజ్ఞానం..తెలివితేటలు రమ్మంటే ఎలా వస్తాయి?

10_022 కథావీధి – వడ్డెర చండీదాస్ రచనలు – అనుక్షణికం3

తన అహంకారం బయట ప్రపంచం కోసమే కానీ, రవి ముందు ప్రవర్తించడం కోసం కాదనీ, తన ప్రేమనూ తిరస్కరించిన బావ మీద తనకి జాలే కానీ కోపం లేదనీ, తెలియజేసి, అతను వచ్చిన పని తనకి తెలుసుననీ, మంత్రి పదవికి ఏమీ ఇబ్బంది ఉండదనీ, నిశ్చింత గా ఉండమనీ, సలహా చెప్పి సాగనంపుతుంది.