October 2021

11_003 పెళ్ళికి రండి – ఆనందం ఈవేళ

అమ్మాయిని పెళ్ళికూతుర్ని చేసేటప్పటి పాట ఆనందం ఆనందం ఈవేళ పిల్ల పెళ్ళికూతురాయె ఈవేళ నిను పెళ్ళికూతుర్ని చేసేటి శుభవేళ తోడ పెళ్ళికూతురితో మురిసేటి ఈవేళ ఆనందం…. నీ పెళ్ళిపనులింట ఉత్సాహమే నింప నీకు కానుకలిచ్చి ఎల్లరు దీవింప ఆనందం… ఆయురారోగ్యములతో పసుపుకుంకుమలతో నీవు కలకాలం వర్ధిల్లు ఆనందం ఇనుమడింప ఆనందం…

11_003 నను గన్న తల్లి….

సంగీత కళాకారిణి, సంగీత చికిత్సా నిపుణురాలు కాళీపట్నం సీతా వసంతలక్ష్మి గారు సింధు కన్నడ రాగంలో, అది తాళంలో ఆలపించిన త్యాగరాజు కీర్తన “ నను గన్న తల్లి…. ”.

11_003 తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత

అమెరికా చికాగొ నగరంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారతీయ సాహిత్యం, కళలకు సేవలందిస్తున్న శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా వ్యవస్థాపకులు డా. శారదాపూర్ణ శొంఠి గారి “ తాళ్ళపాక అన్నమాచార్యుని సంగీత, నృత్య కళాభిజ్ఞత ” గురించిన సోదాహరణ ప్రసంగ పరంపర లో మొదటి భాగం….

11_003 నను బ్రోవమని చెప్పవే

ద్విభాష్యం నగేష్ బాబు గారి వీణ లో పలికించిన “ ది స్వర ఆఫ్ రామదాసు ” ఆల్బం నుంచి మిశ్రచాపు తాళం, కళ్యాణి రాగంలో రామదాసు కీర్తన “ నను బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి ” కుమారి లక్ష్మి అభినయంలో…..

11_003 శారదా భుజంగ స్త్రోత్రం

శ్రీదేవి జోశ్యుల బృందం ఆలపించిన అది శంకరాచార్య విరచిత “శారదా భుజంగ స్త్రోత్రం ”
ఆర్. కె. శ్రీరామ్ కుమార్ స్వరకల్పనలో రాగమాలిక.

11_003 దేవీస్తుతి

ప్రముఖ నృత్య కళాకారిణి అచ్యుతమానస “ కూచిపూడి నృత్యాభినయ వేదం – మోక్ష మార్గం ” పేరుతో మహనీయులు శ్రీశ్రీశ్రీ చిన జియ్యర్ స్వామి, శ్రీ విశ్వంజీ స్వామి, ప్రముఖ దర్శకులు పద్మశ్రీ కళాతపస్వి కె. విశ్వనాథ్, శ్రీ ఘంటా శ్రీనివాసరావు, వి. ఎన్. విష్ణు ( ఐ‌ఏ‌ఎస్ ) చేతుల మీదుగా విడుదల చేసిన డి‌వి‌డి సంకలనం నుంచి……