January 2022

11_009AV మన తెలుగు నవరత్నాలు

పద్యం తెలుగు భాషకు అందమైన అలంకారం. మన తెలుగు భాషలో రత్నాల వంటి కవులు ఎందరో ఆణిముత్యాల వంటి పద్యములను రచించారు. మన కవులలో నవరత్నాలు అన దగ్గ కవులు తొమ్మిది మంది కలముల నుంచి వెలువడిన పద్యములు కొన్ని….

11_009AV గోవిందాశ్రిత గోకులబృందా….

శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీరామ్ శొంఠి, డా. శారదపూర్ణ శొంఠి గారల స్వగృహంలో 2021 నవంబర్ 14వ తేదీన నిర్వహించిన “ అన్నమాచార్య సంకీర్తనా పుష్పార్చన ” నుండి…..

11_009AV ఉత్తరాయణం

సూర్యుడు తన నిరంతర యానాంలో మకర రాశిలోకి ప్రవేశించే రోజునే ‘ మకర సంక్రాంతి ‘ అని పిలుస్తారు. దక్షిణ దిక్కు నుంచి ఉత్తర దిక్కు కు సూర్యుడు తన ప్రయాణ దిశను మార్చుకునే సందర్భాన్ని ‘ ఉత్తరాయణం ‘ అని అంటారు. ఈ ఉత్తరాయణం చాలా విశిష్టమైనది. ‘ ఉత్తరాయణ పుణ్యకాలం ‘ అనడం అందరూ వినే ఉంటారు.