11_009AV

11_009AV వార్తావళి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ’ లో భాగంగా “స్త్రీల సాహిత్యంలో ప్రతిఫలించిన దేశ స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి ” ప్రసంగం, అమరజీవి స్మారక సమితి నిర్వహిస్తున్న ‘ మాలతీచందూర్ సాహితీ పరిశోధన పురస్కారం ’ వివరాలు, అమెరికాలో క్లీవ్‌లాండ్ త్యాగరాజ ఉత్సవం నిర్వహిస్తున్న “ 8 వ మార్గాళి సంగీత మేళా ” వివరాలు….

11_009AV గీతా పారాయణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భగవద్గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన గీతా పారాయణ పోటీలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం పొందిన వాసంశెట్టి కార్తిక్ ( ఖరగ్‌పూర్ ఐ‌ఐ‌టి లో ద్వితీయ సంవత్సర విద్యార్థి ) గళం నుండి కొన్ని శ్లోకములు…

11_009AV మగ పెళ్ళివారమండి

జోశ్యుల ఉమ, జోశ్యుల శైలేష్ ల స్వరకల్పన, ఉమా శ్యాంసుందర్ మరియు లక్ష్మి రామసుబ్రహ్మణ్యం గానంలో సరదాగా సాగే తెలుగు వారి పెళ్లిపాటల సంకలనం “ పెళ్ళికి రండి ” నుంచి……

11_009AV తాళ్ళపాక అన్నమాచార్య కళాభిజ్ఞత 04

సాహిత్యంలోనూ, సంగీతం లోనూ దేశీయమైన భావుకత, దేశీయమైన భాష ఉపయోగించడంలో పద నిర్దేశం చేసిన మహానుభావుడు తాళ్ళపాక అన్నమాచార్య….. శారదాపూర్ణ గారి ప్రసంగానికి అనుబంధంగా విదూషీమణి సరస్వతీ రంగనాథన్ గారు వీణ పై సోదాహరణంగా వివరించిన మూడు రాగాలు.

11_009AV గోదా కల్యాణం

ప్రముఖ నృత్య కళాకారిణి అచ్యుతమానస “ కూచిపూడి నృత్యాభినయ వేదం – మోక్ష మార్గం ” పేరుతో విడుదల చేసిన డి‌వి‌డి సంకలనం నుంచి…… గోదాదేవి వృత్తాంతాన్ని తెలియజెప్పే….

11_009AV మన తెలుగు నవరత్నాలు

పద్యం తెలుగు భాషకు అందమైన అలంకారం. మన తెలుగు భాషలో రత్నాల వంటి కవులు ఎందరో ఆణిముత్యాల వంటి పద్యములను రచించారు. మన కవులలో నవరత్నాలు అన దగ్గ కవులు తొమ్మిది మంది కలముల నుంచి వెలువడిన పద్యములు కొన్ని….

11_009AV గోవిందాశ్రిత గోకులబృందా….

శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంస్థ తమ 33 సంవత్సరాల వేడుకలో భాగంగా అమెరికా లోని సంస్థ నిర్వాహకులు డా. శ్రీరామ్ శొంఠి, డా. శారదపూర్ణ శొంఠి గారల స్వగృహంలో 2021 నవంబర్ 14వ తేదీన నిర్వహించిన “ అన్నమాచార్య సంకీర్తనా పుష్పార్చన ” నుండి…..