10_004

10_004 నివాళి – ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

అటు సంగీతపరమమైన విద్వత్తు మాత్రమే కాకుండా, మరొక ప్రక్క వినయశీలత, సౌహార్దము కూడా ఇతోధికంగా చోటుచేసున్నాయి. అందువలననే ఆయన ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది శ్రోతల హృదయాలలో ఏనాటికి చెరగని, తరగని స్ధానాన్ని సంపాదించుకున్నారు. నిజానికి అదే అసలు సిసలైన సిరి, సంపద అన్నమాట ! బిరుదులూ, సన్మానాలు కంటే అదే మిన్న. అసలు అయన పేరే ఒక మహత్తు… విద్వత్తు… సూక్ష్మంగా విశ్లేషించి చూస్తే ఆయన( పేరు) లో సరస్వతీదేవితో బాటుగా మరో నలుగురు దేవుళ్ళు పీఠం వేసుకుని కూర్చున్నారు.

10_004 కథావీధి – ఆడవాళ్ళ అంతరంగం

తమకు, ( అనగా మేష్టారికి ) బతకడం చేత కాదనీ, ఆ విషయం ఏనాడో ఋజువై పోయిందనీ, మనకు కోర్కెలు తీర్చుకునే తాహతు లేదనీ, ఏదో దొరికింది తింటాం. మనుషుల్లా ఇలా ఉంటాం. కాకపోతే రెండేళ్ల కొకర్ని లెక్కగా కంటాం అనీ “ ఈ మాత్రానికి లేనిపోని సోదె లు ఎందుకులెండి. ఒక ఇల్లాలు మొగుడు కొట్టినందుకు కాక ఇతరులు నవ్వినందుకు ఏడ్చిందట. మనకు సంపాదన చేతకాక ఇంకొకళ్ళని చూసి ఉక్రోషం పడడం ఎందుకు లెండి ఇహ ఊరుకోండి ” అని సంభాషణ ముగిస్తుంది.

10_004 భావ వ్యక్తీకరణ… పత్రికల నిర్వహణ – గాంధీజీ

తన కమ్యూనికేషన్ కు మాటను, మౌనాన్నీ వినియోగించారు. సంభాషణ, ప్రసంగం, పాత్రికేయం ఆయన సాధనాలు. సుమారు నలభై సంవత్సరాలు ఆయన చాలా క్రియాశీలంగా పత్రికలు నడపడం గమనార్హం. ప్రపంచాన్ని చేరాలంటే ఇంగ్లీషు వాడినా మాతృభాషను, భారతీయ భాషలను ఆయన నిరాదరించలేదు. ఆయన తొలి పుస్తకంతో పాటు ఆత్మకఠను కూడా గుజరాతీలో రాశారు. పత్రికలే కాదు కరపత్రాలు ప్రచురించారు. పుస్తకాలు కూడా వెలువరించారు. మాట పనిచేయని ఛోటా, వేళా మౌనవ్రతం కూడా పాటించారు. తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

10_004 వెలుగునీడలు

తే. గీ. తనను పగులగొట్టగ వచ్చునినుమునైన
బంగరుగ మార్చివేయును పరుసవేది !
నిన్ను ద్వేషించి దూషించునీచునైన
మోక్ష మిచ్చి రక్షింతు వోముక్తిదాత !

10_004 సౌభాగ్యలక్ష్మి

ఓ సౌభాగ్యలక్ష్మి !
సంసారమనే స్వేదముతో
కలుషమైన మోహజాలంలో
మానవులు మునిగి త్రేలుచున్నారు.
అమ్మా ! మానవ జీవితమన్న
ఎత్తు పల్లములతో కూడినదిగదా !

10_004 స్త్రోత్రమాలిక – శుక్లాంబరధరం

సర్వ వ్యాపకుడైన విష్ణువుగా గణపతి ని చెప్పుకోవచ్చు. నాలుగు భుజములు కలిగినవాడు గనుక చతుర్భుజుడు. అసలు చతుర్భుజుడు అంటే అర్థమేమిటి ? మన లాగే రెండు చేతులు కాకుండా నాలుగు చేతులు ఎందుకు ఉన్నాయి ? అవి దేనికి సంకేతాలు ? మనకి రకరకాల విఘ్నాలు ఎదురవుతూ ఉంటాయి.