11_008

11_008 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – లెట్స్ గో ఇండియా

“దూరపు కొండలు నునుపు” అని ఇక్కడలేనిదేదో అక్కడ ఉందని పరుగులెత్తుతూ ఉంటాం. ఎక్కడుండే సుఖాలు అక్కడున్నాయి. ఎక్కడుండే కష్టాలు అక్కడున్నాయి. సమస్యల్ని…ఇబ్బందుల్ని జాగ్రత్తగా తెలివిగా అధిగమిస్తూ వెళ్ళటమే మనపని. ఎవరికైన చిన్ననాటి మధురస్మృతుల్ని అప్పటి సరదాలను మనసులో భద్రంగా దాచుకోవాలే కాని వాటిని మళ్ళీ పొందాలని ప్రయత్నం చేస్తే అవి చేదుస్మృతులయ్యే ప్రమాదం ఉంది.

11_008 ముకుందమాల – భక్తితత్వం 03

ముకుందః! దేవః! దేవకీనందన జయతు జయతు మోక్షమునిచ్చే వాడు ముకుందుడు. ఎవరీ ముకుందుడు ? మా దేవకీనందనుడే! తానెక్కడో గోలోకంలోనో, వైకుంఠంలోనో ఉంటే మనం తనను చేరలేమనీ, పొందలేమనీ, తానే దిగివచ్చి, తనచేత సృష్టించబడిన ఈ జగత్తులో, ఒక తల్లిగర్భాన పదినెలలు వసించి, ఆ తల్లి కడుపుపంటగా, ఆనందసంధాయకుడై, జన్మించినాడు.