Category: 11_018&019AV

11_019AV గుడిగంటలు – భక్తి కావ్యం

కవిద్వయం అనదగ్గవారు పింగళి-కాటూరి కవులు ..‌
వీరిలో ఒకరైన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారు వ్రాసిన ప్రసిద్ధ కావ్యములనేకములలో
“గుడిగంటలు” భక్తికావ్యం ఒకటి. ఆ గ్రంధం నుంచి మీ కోసం కొన్ని పద్యరత్నాలు…

11_018 కూచింత కాఫీ

చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన కాఫీ హాస్య, వ్యంగ్య గుళికలు…… మరికొన్ని… .

11_018 చేతికొచ్చిన పుస్తకం 04

ఆ లేపాక్షి ఆలయశిల్పకళకు ఆటపట్టు అనేది నానుడి కాగా, ఈ లేపాక్షి కార్టూన్స్ కు కాణాచి అనేది న్యూనుడి!
మొన్నటి దాకా ‘సాక్షి’ పత్రికలో కార్టూన్స్ తో అఠకాయించిన లేపాక్షి, హఠాత్తుగా డిసెంబర్ 22న బుక్ ఫేర్ లో మాస్క్ ఉన్న మరో ఇద్దరు కార్టూనిస్టుల సాయంతో రాస్తారోకో చేసి, నవ్వులతో మునిగి తేలండని తన పుస్తకం ‘నవ్వొచ్చే కార్టూన్లు’ రెండు భాగాలు నవ్వకుండా బహుకరించారు!

11_018 తో. లే. పి. – వంగూరి చిట్టెన్ రాజు

చిట్టెన్ రాజు గారి మాట ఆత్రేయపురం పాలకోవా అంత, కాకినాడ కోటయ్య కాజా అంత మధురాతిమధురం – మేము ప్రత్యక్షం గా ఒకరినొకరం ఈనాటికీ కలుసుకోకపోయినా ‘మాట’ ఉంది చూసారూ.. అది మా ఇద్దరినీ కలిపి మా మనసులను మరింత దగ్గర చేసింది. మేము అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకున్నా, ఒకరికొకరం గాలిలో ( మేఘ ) సందేశాలను పంపుకున్నా – ఆ ఆనందం అనుభవైకవేద్యం.. మాటలలో ఇమడనిది – అక్షరాలకు అందనిది !!

11_018 నొప్పుల దిగుమతులు – వ్యక్తుల తిప్పలు

అసలు కొందరు వ్యక్తులతో మాటాడుతుంటే తలనొప్పి రాకమానదు – వచ్చిన తర్వాత మాత్రం వదిలించుకొని అవతలకు పోవడం సాధ్యమా ! ఈ వ్యక్తిని ఎందుకు పరిచయం చేసుకొన్నానా ? ఇంతకాలం ఎలా భరించాను ? ఇంకోవూరు పోదామన్నా వీలు లేదు, ఈ సంసారాన్ని ఎత్తుకొని – అని తలనొప్పితో బాధ పడుతూనే తన దుస్థితిని వర్ణించుకోక తప్పదు.

11_018 ముకుందమాల 08

సంసారాన్ని హరించి, పాపాలను పోగొట్టి దీనుడనైన నన్ను ఉద్ధరించి నీ దర్శన భాగ్యమును కన్నులకు కలిగించు తండ్రీ. జగత్కారణమై, ప్రేరకమై, సాక్షియు నయిన ఆ పుండరీకాక్షుని ప్రేమతో తలిస్తే చాలు. నీ ప్రయత్నమక్కరలేకుండానే తరింపబడగలవు. భక్తే భగవంతుని చేర్చేది విష్ణుపోతాన్ని నువ్వు ప్రయత్నించి ఎక్కలేక పోయినా, ‘‘అదియే నిన్ను రక్షించగలదని’’ నమ్మకంగా, భక్తితో తలచుకో! అంతే. అదే నిన్నెక్కించుకుంటుంది.