13_001

13_001 వార్తావళి

“ 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ” వివరాలు, ఆటా అధ్వర్యంలో “ స్వదేశ్ ” కార్యక్రమ వివరాలు, అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి నెల నేలా వెన్నెల ఆగష్టు కార్యక్రమ వివరాలు, “ డయస్పోరా తెలుగు కథానిక 17 ” వివరాలు …..

13_001 ఆనందవిహారి

అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా జూలై నెల “ తెలుగు సాహితి – ప్రాచీనత, ఆధునికత ” ప్రసంగ విశేషాలు, తూర్పు గోదావరి జిల్లా లోని ఉన్నత పాఠశాల విద్యార్థులకు ప్రేరణా ప్రసంగం విశేషాలు, హాంగ్ కాంగ్ లో కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాల విశేషాలు……

13_001 తో. లే. పి. – విజయ్ ఎన్. సేఠ్

ఉత్తరాలుగా మనం ప్రస్తావించుకునే ‘ లేఖ ’ లు. ఆ రోజులలో వీటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ రోజయితే అవి చాలామటుకు కనుమరుగయాయని చెప్పక తప్పదు. అప్పట్లో పోస్టుకార్డ్ అయినా, ఇన్లాండ్ కవరయినా, కవరయినా – ఆమూల్యాభారణం. వాటిని పోస్టు లో రాగా చిరునామాదారునికి అందించే పోస్ట్ మ్యాన్ ఒక దైవస్వరూపుడు !!

13_001 లలిత సంగీత ధృవతార

కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన “అమృత్” పురస్కారం తనే స్వయంగా అందుకుంటారని నమ్మాను. ఆ అత్యుత్తమ పురస్కారం తరువాత ఇద్దాం, ముందు ఫెలోషిప్ ప్రకటించినవారికి అవి అందజేద్దాం, అన్నారట. నాలాంటి చిత్తరంజన్ అభిమానులు, శిష్యులు ఎంతో నిరాశ చెందారు. కానీ, ఈ అనుభూతులను ఏనాడో దాటేసిన ఆ మహనీయుడు, “అంతా మన మంచికే జరుగుతుంది తల్లీ. సుబ్రహ్మణ్య స్వామి అలా నిర్ణయించారు.” అని చెప్పినట్టు అనిపించింది. ‘ఆయన సమభావాన్ని, నిర్లిప్తతని గౌరవించాలంటే ఆయనని గుర్తించి గౌరవించాలని అనుకున్నవారిని గౌరవించాలి.’ అనిపించింది.

13_001 వందనం గిరినందిని

వందనం గిరినందిని ప్రియనందినా
వందనం ఇదే వందనం

వందనం కరివదన కరుణాసదన
నీ పదకమలముల కడ
వందనం ఇదే వందనం

13_001 బాబ్జి బాకీ

తీర్థంలో అమ్మే గూడు బండి కొనుక్కోవాలని ఎంతో కోరికగా ఉండేది, మూడు చక్రాలతో చిన్న చక్కబండి, పైన గూడులా రేకుతో చూడటానికి భలేవుండేది. తాడుకట్టి లాగుతుంటే మేమే ఆ బండి ఎక్కినంత ఆనందపడేవాళ్ళం. ఆ బండి ఖరీదు రెండురూపాయలు. మాకిచ్చేది పావలా మాత్రమే. రెండు రూపాయలు ఇవ్వండి బండి కొనుక్కుంటాను అని అడగడం మాకు తెలీదు. ఇంట్లో పిల్లలందరికీ పావలా మించి ఇచ్చేవారు కాదు. ఆ పావలా కోసం, ఆ తీర్థం కోసం రెండు నెలల ముందు నుండీ ఎదురుచూసేవాళ్ళం.

13_001 హిమాలయం

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు రాగసుధ విద్యార్థులు.

13_001 కదంబానుబంధం

నవత, సమతల వికసిత నందివర్ధనాలు వెలుగు
తెలుగు సొగసుల సంపెంగలు అన్నీ కలగలిసి
పరీమళ గుబాళింపులు సారస్వత సమాజమూ కదంబమే
ఏకత, సమరసత అందులో భాగమే!