13_001

13_001 దక్షిణాయనం

ఉత్తరాయణం, దక్షిణాయనం అనేవి సూర్యుని యొక్క గమనమును బట్టి నిర్దేశించబడి ఉంటాయి. సూర్యోదయాన్ని రోజూ గమనిస్తూ ఉంటే తూర్పునే ఉదయిస్తున్నా ఒకే ప్రదేశంలో ఉదయించడం లేదని గమనించవచ్చు. అంటే రోజు రోజుకీ ఉదయించే ప్రదేశం కొద్దిగా మారుతూ వస్తుంది. ఇలా సూర్యుడు జరిగే దిశను బట్టి ఈ విభజన జరిగింది. ఉత్తరం వైపు జరిగితే ‘ ఉత్తరాయణం ’ గా, దక్షిణం వైపు జరిగితే ‘ దక్షిణాయనం ’ గా పిలుస్తారు. ఉత్తరాయణ కాలంలో నీటి ఆవిరి రూపంలో పైకి తీసుకున్న నీరంతా దక్షిణాయన కాలంలో క్రిందకు వర్షం రూపంలో తిరిగి వస్తుంది. భగవంతుడు ఈ దక్షిణాయనం లో మనకోసం క్రిందకు దిగివస్తాడని చెప్పుకుంటారు.