13_007 అభిప్రాయ కదంబం
గత సంచిక పైన, అందులోని అంశాల పైనా పాఠకుల అభిప్రాయాలు… అభిప్రాయ కదంబం
గత సంచిక పైన, అందులోని అంశాల పైనా పాఠకుల అభిప్రాయాలు… అభిప్రాయ కదంబం
అమరజీవి స్మారక సమితి బనారస్ హిందూ విశ్వవిద్యాలయం సంయుక్తంగా సమర్పిస్తున్న” శ్రీమతి మాలతీచందూర్ నవల – సిద్ధాంత వ్యాసం ” పోటీ వివరాలు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా నిర్వహిస్తున్న “ 29వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ” వివరాలు, వంగూరి ఫౌండేషన్ కాకినాడ లో నిర్వహిస్తున్న “ అఖిల భారత తెలుగు సాహితీ సదస్సు ” వివరాలు, బే ఏరియా తెలుగు సంఘం నిర్వహిస్తున్న “ ఉగాది మహోత్సవం ” “ హోలీ ఫెస్ట్ ” వివరాలు …..
చిత్రకారుడు ‘ కూచి ’ కుంచె నుంచి జాలువారిన మరో కళాఖండం…
పరమ దయా కర మృగ ధర హర గంగా ధర ధరణీ
ధర భూషణ త్యాగరాజ వర హృదయ నివేశ….
పంతువరాళి రాగం, రూపక తాళం లో త్యాగరాజ కీర్తన….
1949 వ సంవత్సరంలో పెద్ద ఉప్పెన గాలి వచ్చింది. అంటే తుఫాను లాంటిది. మా ఇల్లు పెద్ద మండువా ఇల్లు. ఇల్లు రోడ్డు కంటే పల్లముగా ఉండడంవల్ల ఇంటిలోకి నీళ్ళు వచ్చాయి. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత ఇంట్లోనుండి బయటకు వెళ్లి చూస్తే, మా చిన్నాన్న గారి ఇంటిలో నారింజ చెట్టు పడిపోయింది. కాయలన్నీ రాలిపోయాయి.
చెరువు గట్టు వైపు చూస్తే, చెట్ల కొమ్మలు విరిగి నేల మీద పడి ఉన్నాయి. కాకులు గుట్టలుగా చచ్చిపడి ఉన్నాయి. ఎన్నో జంతువులు చచ్చిపోయాయి.
‘ కరీమ్‌నగర్ క్షేత్రాలు ‘ ఆల్బం నుండి డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి ఏ. ఏ. రాజా సంగీతం సమకూర్చగా పద్మజ శొంటి గానం చేశారు.
మైత్రీబంధం ఇరువురి మధ్యన నెలకొనడానికి మూలము ఏమిటీ అంటే ఇది అని ఇదమిద్ధంగా చెప్పలేము. వాస్తవానికి ఎల్లలెరుగనిది స్నేహం. దేశం, భాష, వృత్తి, కులం-గోత్రాలతో దీనికి సంబంధం లేదు.
నేటికీ సుమారు 38 ఏళ్ళ క్రితం, అంటే – 1986 వ సంవత్సరంలో నాకు దక్షిణ భూటాన్ లోని ‘ గేలెగ్‌ఫగ్’ కి చెందిన కెంఛో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం |
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
భాషలందు తెలుగు లెస్స
వంశపారంపర్య మహత్యమేమో నాకు మలయాళంతో పాటు తమిళం, హిందీ, కన్నడ, ఫ్రెంచ్, ఆంగ్ల బాషలు వచ్చు. సొంపైన తెలుగు సాంతంగా అర్ధమవుతుంది. తెలుగు మాటలలోని ప్రతి చివరి అక్షరం హల్లులతో కలిసి ఉంటుంది. ఉదాహరణకి ‘రాముడు’, ‘రామ’ అంటూ దీర్ఘం తీయటానికి ఎంతో సౌకర్యం.
తెల్లవారే సరికి రకరకాల పూలు పూసి మురిపించేవి. దొడ్లో కాసిన కూరలు అప్పటికప్పుడు కోసి వండుకొంటే రుచి, ఆరోగ్యం,ఆనందం. జామపండ్లు, మామిడి పండ్లు చెట్టునుండి కోసుకొని,కోరుక్కు తిన్న తృప్తి అనుభవైక వేద్యం.
రోడ్డుకి ఇరువైపులా ఎండకి నీడని,వానకి రక్షణని ఇస్తూ చెట్లు గొడుగులా నిలబడేవి. ఇప్పుడేవీ ? అవన్నీ గతకాల వైభవాలుగా మారిపోయినాయి. ఆ చక్కటి వృక్షాలన్నీ పట్టణాలలో ఆకాశహర్మ్యాలకు బలి అయిపోయాయి.