‘ బాలకదంబం – 2018 ‘ ప్రకటన

బాలల ప్రత్యేక సంచిక

సూచనలు :- 

ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 14 వ తేదీ ‘ బాలల దినోత్సవం ’ సందర్భంగా బాలల మనోవికాసానికి పెద్ద పీట వేస్తూ ‘ శిరాకదంబం ’ పత్రిక “ బాల కదంబం ” పేరుతో బాలల ప్రత్యేక సంచిక వెలువరించడం జరుగుతోంది.

ఈ ‘ బాల కదంబం ’ ప్రత్యేక సంచికలో 16 సంవత్సరాల లోపు పిల్లలందరూ పాల్గొనవచ్చును. ఈ క్రింది శీర్షికలలో తమ అంశాలను ప్రచురణకు పంపించవచ్చును.

 1. రచన : చిట్టి కథ, కవిత, పాట, వ్యాసం, జోకులు మొదలైన అంశాలలో ఏ విషయం మీదనైనా వ్రాసి పంపవచ్చును. A4 సైజ్ లో ఒక పేజీకి మించకుండా చేతి వ్రాతతో గానీ, యూనీకోడ్ లో టైప్ చేసి గానీ పంపవచ్చును. వాటిని ఇ మెయిల్ ద్వారా గానీ, పోస్ట్ ద్వారా గానీ పంపవచ్చును. చేతి వ్రాతతో వ్రాసినవి ఇ మెయిల్ ద్వారా పంపేటప్పుడు స్పష్టత కోసం వాటిని స్కాన్ చేసి పంపటం తప్పనిసరి. వ్యాసాల విషయంలో తెలుగు ప్రముఖుల గురించి గాని, తెలుగు వారికి సంబంధించిన ఏ విషయమైనా తీసుకోవచ్చును.
 2. కళాభిరుచులు : సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, హస్తకళలు, నాటకం, మిమిక్రీ వంటి ఏ ప్రక్రియ లోనైనా తమ ప్రతిభను చాటే అంశాలను పంపించవచ్చును.

అ ) సంగీతం : పాట లేదా పద్యం ( గాత్రం లేదా వాయిద్యం ) ఆడియో గానీ, వీడియో గా గానీ రికార్డు చేసి పంపవచ్చును. పాట అయితే ఒకటి మాత్రమే, పద్యములు అయితే నాలుగు పద్యాలు మించకుండా పంపవలెను. తెలుగు లలిత గీతాలకు ప్రాముఖ్యత. సినిమా పాటలు పరిశీలించటం జరుగదు.

ఆ ) నృత్యం : శాస్త్రీయ, జానపద, లలిత గీతాలకు చేసిన నృత్యాలు మాత్రమే పంపవలెను. సినిమా పాటల నృత్యాలు పరిశీలించడం జరగదు. ఒక్కొక్కరు ఒక అంశం మాత్రమే వీడియో రికార్డు చేసి పంపవలెను. ఆహార్యం, ప్రత్యేకమైన దుస్తులు లేకపోయినా, అభ్యంతరకరం కాని సాధారణమైన దుస్తులలో చేసినవి కూడా పరిశీలించబడును.

ఇ ) నటన : ఏదైనా నాటకం లోని సన్నివేశం గాని, చిట్టి నాటిక గాని… ఏదైనా అయిదు నిముషాల నిడివికి మించకుండా వీడియో రికార్డు చేసి పంపవచ్చును. అందులో పాల్గొన్న పిల్లలందరి వివరాలు తప్పనిసరిగా పంపించవలెను. అలాగే అదే నిడివి లోపున ఏకపాత్రాభినయాలు, విచిత్ర వేషములు, మిమిక్రీ వంటివి కూడా వీడియో గా పంపవచ్చును.

ఈ ) చిత్రం : చిత్రాలు సాధారణంగా A4 సైజ్ లో ఉండవచ్చును. ఏ విషయం మీదనైనా గీయవచ్చును. వాటిని స్పష్టత కోసం స్కాన్ చేసి పంపించడం తప్పనిసరి. డిజిటల్ చిత్రాలు కూడా పరిశీలించడం జరుగుతుంది. వ్యంగ్య చిత్రాలు ( కార్టూన్లు ) కూడా పంపించవచ్చును. ఇదే విభాగంలో పిల్లలు తీసిన ఛాయాచిత్రాలు ( ఫోటోలు ), పిల్లలు తీసిన లఘు చిత్రాలు ( short films ) కూడా పంపవచ్చును. 

ఉ ) హస్తకళలలో ప్రవేశం ఉన్న బాలలు తమ ప్రతిభను తెలియజేసే అంశాల వివరాలు, వాటి ఫోటోలు, అందుకున్న యోగ్యతా పత్రాలు ( సర్టిఫికేట్లు ) పంపవలెను. అలాగే వాటి తయారీని వీడియో తీసి కూడా పంపించవచ్చును. వాటి వివరణ కూడా అందులో రికార్డు చేసి పంపించవచ్చును.

 1. ప్రతిభ : ఇతర విషయాలలో ప్రతిభ గల బాలలు ( ఉదా. స్పెల్లింగ్, జనరల్ నాలెడ్జ్, గణిత శాస్త్రం, విభిన్నమైన ఆటలు వగైరాలతో బాటు విభిన్నమైన అంశం ఏదైనా ) తమ ప్రతిభను తెలిపే వివరాలు, ఫోటోలు, సాక్ష్యాలు, యోగ్యతా పత్రాల ( సర్టిఫికేట్లు ) నకళ్లు ( copies ) లాంటివి తప్పనిసరిగా పంపవలెను. ప్రతిభను ప్రదర్శించే వీడియోలు కూడా పంపవచ్చును.నియమ నిబంధనలు, సూచనలు : * ఒక్కొక్కరు ఎన్ని అంశాలైనా పంపవచ్చును. కానీ రచనలైతే ఒక పేజీకే పరిమితం కావాలి. వ్యాసాలు రెండు పేజీల వరకూ ఉండవచ్చును.

  * తాము పంపిస్తున్న అంశంతో బాటు ఒక ఫోటో, పూర్తి పేరు, చదువు, పాఠశాల, వయసు, తల్లిదండ్రుల పేర్లు తప్పనిసరి.

  * వయసుకి సంబంధించిన ధృవీకరణ పత్రం ( బర్త్ సర్టిఫికేట్ గాని, పాఠశాల ప్రధానోపాధ్యాయుల సర్టిఫికేట్ గాని ) తప్పనిసరి. ఈ పత్రాలు మెయిల్ లో పంపుతున్నపుడు స్కాన్ చేసి పంపవలెను.

  * వీటితో బాటు తాము పంపిస్తున్న అంశం పూర్తిగా తమ స్వంతమని, దేనికీ లేదా ఎవరికీ అనుసరణ కాదనీ, ప్రచురణ కోసం, పరిశీలన కోసం ఇతర పత్రికలకు గాని, వెబ్ సైట్ లకు గాని వేటికీ ఇంతకుముందు పంపలేదని ధృవీకరణ పత్రం తప్పనిసరి. తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా పిల్లల తరఫున ధృవీకరణ పంపవచ్చును. ధృవీకరణ పత్రం సరిగా లేకపోతే తిరస్కరించే అధికారం ‘ శిరాకదంబం ‘ పత్రిక యజమాన్యానిదే !

  * ఆడియో లేదా వీడియో లు సెల్ ఫోన్ లో కూడా రికార్డు చేసి పంపవచ్చును. అయితే స్పష్టత అవసరం. వీడియోల విషయంలో అంశం ప్రదర్శిస్తున్న పిల్లల మీద సరిపడా లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. ముఖం మీద కంటే వెనుక ఎక్కువ లైట్ లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఆడియో స్పష్టత కోసం వీలైనంత దగ్గరగా కెమెరా / మొబైల్ మైక్ ఉంచడంతో బాటు, చుట్టు ప్రక్కల శబ్దాలు రాకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి. 

  ముఖ్య గమనిక : ఇది పోటీ కాదు. పరిశీలించి ప్రచురణార్హమైన వాటినన్నిటినీ  ప్రచురించడం జరుగుతుంది. ప్రచురణ విషయంలో పత్రిక యాజమాన్యానిదే తుది నిర్ణయం. ప్రచురణార్హం అయిన వాటిని ‘ బాల కదంబం ’ ప్రత్యేక సంచిక లో ప్రచురించడం జరుగుతుంది. ప్రచురణార్హం కాని వాటిని గురించి విడిగా తెలియజేయడం గాని, తిప్పి పంపడం గాని జరుగదు. 

  గడువు తేదీ : 05 నవంబర్ 2018.

  గడువు లోపున వచ్చిన వాటిలో ప్రచురణార్హం అయిన వాటినన్నిటినీ వీలైనంతవరకూ ‘ బాల కదంబం ’ ప్రత్యేక సంచికలో ప్రచురించడం జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో వుంటే అదనంగా ఉన్న వాటిని, గడువు తర్వాత వచ్చిన వాటిలో అర్హమైనవాటిని వీలు వెంబడి తర్వాత సంచికలలో ప్రచురించడం జరుగుతుంది. 

  ‘ బాల కదంబం ’ కోసం బాలలు తమ అంశాలను పంపవలసిన మెయిల్ ఐడి :

  editorsirakadambam@gmail.com / editor@sirakadambam.com / madhureekrishna@yahoo.com

  ఫోటోలు, వీడియో లు మొదలయినవి Whatsapp No.  +91 8985357168 / +91 94451 11999  కు కూడా పంపవచ్చును.

  ‘ బాల కదంబం ’ లో పాల్గొనేలా మీ పిల్లల్ని ప్రోత్సహించండి. మీ అండదండలను అందించి వారి స్వీయ ప్రతిభను ప్రపంచం ముందు ప్రదర్శించే అవకాశాన్ని ఇవ్వండి.

  ఇతర వివరాలకు పైన ఇచ్చిన మెయిల్ ఐడి లో గాని, వాట్సప్ ద్వారా గాని సంప్రదించండి.