Animals

13_007 చిన్ననాటి జ్ఞాపకాలు

1949 వ సంవత్సరంలో పెద్ద ఉప్పెన గాలి వచ్చింది. అంటే తుఫాను లాంటిది. మా ఇల్లు పెద్ద మండువా ఇల్లు. ఇల్లు రోడ్డు కంటే పల్లముగా ఉండడంవల్ల ఇంటిలోకి నీళ్ళు వచ్చాయి. తుఫాను తీవ్రత తగ్గిన తర్వాత ఇంట్లోనుండి బయటకు వెళ్లి చూస్తే, మా చిన్నాన్న గారి ఇంటిలో నారింజ చెట్టు పడిపోయింది. కాయలన్నీ రాలిపోయాయి.
చెరువు గట్టు వైపు చూస్తే, చెట్ల కొమ్మలు విరిగి నేల మీద పడి ఉన్నాయి. కాకులు గుట్టలుగా చచ్చిపడి ఉన్నాయి. ఎన్నో జంతువులు చచ్చిపోయాయి.

13_006 అమ్మకపు వస్తువులు

డబ్బుల కోసం గడ్డి అనేది చాలా చిన్న పదం. వీళ్ళు దేనికైనా వెను కాడడం లేదు….
ఎలక్షన్లలో సీటు కోసం రాత్రికి రాత్రి పార్టీ మారిపోతున్నారు
అంతవరకు చేసిన దూషణ భూషణ తిరస్కారాలు మరచిపోతున్నారు….
ఆఖరికి అన్నదమ్ములు… అక్కా చెల్లెలు అన్న ధ్యాస కూడా మరచిపోతున్నారు….కేవలం అధికార దాహంతో ఒకరి పై ఒకరు కత్తులు దూస్తున్నారు.

13_005 సంక్రాంతి

తెలుగు వారి పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి.
మన పండుగలన్నీ సంప్రదాయం ప్రకారం సామాజికాంశాలతో బాటు ఆథ్యాత్మికాంశాలు కూడా కలగలసి ఉండడం జరుగుతుంది.
సంక్రాంతి నాలుగు రోజుల పండుగగా చెప్పుకోవచ్చును. మొదటి రోజు భోగి, రెండవరోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవరోజు ముక్కనుమ గా జరుపుకుంటారు.

12_008 బాలకృష్ణ మోహన – స్వరజతి

మోహన రాగం, అది తాళం లో కొచ్చెర్లకోట రామరాజు గారి స్వరరచన.
సంగీతానికి సంబంధించిన అన్ని విషయాలను ఇష్టపడే సహన అబ్బూరి, ఆస్ట్రేలియా లో ఉంటున్న వర్థమాన యువ గాయని. గాత్రంతో బాటు వైయోలిన్ కూడా వాయించగలదు. ఆమెకు జంతువులన్నా, పుస్తకాలు చదవడమన్నా చాలా ఇష్టం.