Brother

13_007 తో. లే. పి. – కెంఛో

మైత్రీబంధం ఇరువురి మధ్యన నెలకొనడానికి మూలము ఏమిటీ అంటే ఇది అని ఇదమిద్ధంగా చెప్పలేము. వాస్తవానికి ఎల్లలెరుగనిది స్నేహం. దేశం, భాష, వృత్తి‌, కులం-గోత్రాలతో దీనికి సంబంధం లేదు.
నేటికీ సుమారు 38 ఏళ్ళ క్రితం, అంటే – 1986 వ సంవత్సరంలో నాకు దక్షిణ భూటాన్ లోని ‘ గేలెగ్‌ఫగ్’ కి చెందిన కెంఛో అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

13_006 మందాకిని – ఆత్మానాం మానుషం మన్యే రామం దశరధాత్మజమ్

మృదుస్వభావి, లేతమనసున్న ఆయన, యువకుడిగా ప్రేమను గెలిచాడు. భర్తగా భార్యని గెలిచాడు. కొడుకుగా తండ్రి కోరిక నెరవేర్చాడు. అన్నగా తమ్ముళ్ళకి రాజ్యాన్ని ఇచ్చాడు. చివరికి రాజుగా ప్రజల సంక్షేమం కోసం, వంశగౌరవం నిలబెట్టడం కోసం తన ఆరోప్రాణం అయిన సీతనే అడవులకి పంపి గొప్ప రాజుగా క్షత్రియ ధర్మం నిలిపాడు. సీత లేని ఎడబాటు భరిస్తూనే రాజ్యపాలన నిర్వర్తించాడు తప్ప ఇంకో పడతి వైపు కన్నెత్తి చూడలేదు. అధికారంలో ఉన్నపుడు సొంత ప్రయోజనాల కంటే విధి నిర్వహణే ముఖ్యం అని ఎలుగెత్తి చెప్పాడు.

13_005 తో. లే. పి. – అన్నయ్య వి. భూపతిరావు

స్కూల్ చదువు పూర్తి అవగానే మా అన్నయ్య కాకినాడ, పి.ఆర్. కాలేజీ లో ఇంటర్మీడియట్, ఆంధ్ర విశ్వ విద్యాలయం, వాల్తేరు లో B.E., ( Electrical Engineering ) పూర్తి చేసాడు. అప్పుడు కాలేజిలో వాడికి కొలీగ్స్.. ఆప్తమిత్రులు గొల్లపూడి మారుతీరావు, వీరాజీ‌, జ్యేష్ట, కొండముది శ్రీరామచంద్రమూర్తి ప్రభృతులు. వీరి సాహచర్యంలో వాడికి నాటకాలు, రచనలు‌, పాటలు పాడడం వగయిరాలతో అనుబంధం ఏర్పడింది.
తరువాత ఉద్యోగ పర్వం.

11_004 తో. లే. పి. – ఆర్టిస్ట్ వాట్స్

ఒక రచన చదివినా, ఒక చిత్రాన్ని చూసినా మనలో ఒక స్పందన కలగడం సహజం. అయితే, ఆ వెంటనే ఆ స్పందనను ఉత్తరరూపంలో ఆ రచయిత కు కానీ చిత్రకారునికి గానీ తెలియపరచడం పాఠకుని ప్రధమ కర్తవ్యం. అది అవతలివారికి కూడా స్ఫూర్తిని ఇస్తుంది. అనడం లో ఎట్టి సందేహానికి తావు లేదు.