13_009 సంగీతం – సర్వేశ్వరుని చేర్చే సాధనం 13
చెన్నమల్లేశ్వర స్వామిని సేవించి, ఆయనకు భక్తురాలై, ఆయన సేవలోనే జీవించి, ఆ దైవం లోనే ఐక్యమైన అక్కమహాదేవి కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ జిల్లా ఊదుతాడి గ్రామంలో క్రీ. శ. 1130వ సంవత్సరంలో వీరశైవుల ఇంట జన్మించింది. బాల్యంలోనే చెన్నమల్లిఖార్జునుని తన భర్తగా స్వీకరించి, ఆయన భావనలోనే కాలం గడిపేది. అప్పట్లో జైన మతవాలంబుడైన ఆ దేశాన్ని ఏలే రాజు కౌశికుడు ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై పెళ్లాడతానని కబురు చేశాడు. మొదట ఒప్పుకోకపోయినా తల్లిదండ్రులను, బంధువులను రాజు దాష్టీకన్నుంచి తప్పించడానికి తల ఒగ్గక తప్పలేదు.