Music

13_004 సంగీతం – సర్వేశ్వరుని చేరే సాధనం 09

భక్త వాగ్గేయకారుల జీవితాలు మహిమాన్వితాలని చెప్పుకున్నాం కదా ! తులసీదాసు విషయంలో కూడా జరిగిన ఒక విశేషాన్ని చెప్పుకోవాలి. ఒకనాడు ఒక స్త్రీ విలపిస్తూ తులసీదాసు పాదాలకు నమస్కరించింది. ఆమెను ‘ దీర్ఘసుమంగళీభవ ‘ అంటూ ఆశీర్వదించాడు. ‘ నన్నెందుకు అవహేళన చేస్తారు స్వామీ ! నా భర్త చనిపోయారు. ఆ దుఃఖం లో ఉండి మీకు నమస్కరించాను ’ అంటుంది.
“ తల్లీ నాకు నిజంగా నీ భర్త మరణించిన విషయం తెలియదు. అప్రయత్నంగా అలా ఆశీర్వదించాను. రాముడే నా నోట అలా పలికించి ఉండాలి. ఆ వాక్కులు వృథా కారాదు. నీవు వెళ్లి చనిపోయిన నీ భర్త చెవిలో రామనామాన్ని ఉచ్చరించు. విశ్వాసంతో వెళ్ళు ” అంటారు. ఆమె అలాగే చేస్తే ఆమె భర్త బతికాడు.

13_004 సాక్షాత్కారము 07

చావు ముంచుకొని వచ్చిన
జీవుల కిక భయ మెక్కడ ?
నిరాశ నిండినదీనుల
నిట్టూర్పుల కం తెక్కడ ?

13_003 వార్తావళి

“ 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ” వివరాలు, అమరజీవి స్మారక సమితి, చెన్నై వారి నెల నెలా వెన్నెల సంగీత సాహిత్య తెలుగు భాషా వికాస పోటీ కార్యక్రమ వివరాలు, అమెరికా లో అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి ధమాకా వివరాలు, హిందూ కమ్యూనిటి అండ్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ‘ సింప్లి ఎస్‌పి‌బి కార్యక్రమ వివరాలు, 44వ క్లీవ్‌ల్యాండ్ త్యాగరాజ ఫెస్టివల్ వివరాలు …..

13_003 యోగనిద్రలో…

యోగనిద్రలో తిరుమల దేవుడు….
డా. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యానికి స్వరకల్పన చేసి పద్మజ శొంఠి గారు గానం.

13_003 సర్వ కళా స్వరూపిణి

సర్వజగత్తు సృష్టించిన ఆ తల్లిలో ఎంత కవనమో ఉంది. ఎంత గానమో దాగిఉంది. జగత్ సృష్టికి మించిన కళ ఏమున్నది ? అంతకు మించిన శిల్పమేమున్నది ? ఆమెలో గోచరించని కళలేమి ఉన్నాయి ? సర్వకళా స్వరూపిణి ఆమె. వాణి ఆమె రూపమే. అందువలన నవరాత్రులలో ఒకనాడు ఆమెను సరస్వతిగా పూజిస్తారు.

13_003 గాంధీ ప్రియ భజన్

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయనకి ప్రియమైన మీరా భజన్…
హరి తుమ్ హారో జన్ కీ భీర్
ద్రోపదీ కీ లాజ్ రాఖీ, తుమ్ బదాయో చీర్….

13_003 నవవిధ భక్తి మార్గం

భగవంతుడిపై చూపే ప్రేమకే ‘ భక్తి ’ అని పేరు. దేవుడితో బంధం ఏర్పడేది బాహ్య క్రియలతో కాదు, మలినం లేని భక్తితోనే అని పురాణాలు చెబుతున్నాయి. భక్తుడు భగవంతుని చేరేందుకు ఉపయోగపడే సూత్రాలు పదకొండింటిని నారదుడు ఉపదేశించగా తదనంతరం అవి తొమ్మిదిగా క్రోడీకృతమయ్యాయి.
నిజానికి ఇవి భక్తి మార్గాలు కావు. భక్తికి తొమ్మిది మెట్లు లేక తొమ్మిది లక్షణాలుగా వేదవ్యాసుడు పేర్కొన్నారని ప్రముఖ సంగీత శాస్త్ర నిపుణుడు డాక్టర్ పప్పు వేణుగోపాలరావు అంటారు.