Shobhakrut

12_009 అన్నమాచార్య కీర్తనలు

తిరుమల తిరుపతి దేవస్థానం వారి పద్మావతి కార్తీక బ్రహ్మోత్సవం లో భాగంగా ప్రముఖ నృత్యకారిణి అచ్యుతమానస కూచిపూడి నృత్య ప్రదర్శన గురు డా. కాజ వెంకట సుబ్రహ్మణ్యం గారి నేతృత్వంలో…..
నట్టువాంగం : గురు డా. కాజ వెంకట సుబ్రహ్మణ్యం
గాత్రం : సూర్యనారాయణ
మృదంగం : సురేష్ బాబు
వైయోలిన్ : రమణ కూచిపూడి

12_009 ముకుందమాల – భక్తితత్వం

నామరసాయనం నీకు శక్తినిస్తుంది. ఆ నామస్మరణ భగవంతునికి దాసుని చేస్తుంది. అంటే ఇంక ఈ చంచలమైన మనసుకు నీవు దాసుడవు కావు అన్నమాట! అప్పుడే పరమాత్ముని గురించిన జ్ఞానం పరమాత్మకు దగ్గర చేస్తుంది. ఈ రసాయనం లోపలి కల్మషాన్ని కరిగించి బలాన్నిస్తుంది. అంతటి శక్తివంతమైనది నామ రసాయనం. నామం ఉంటే నామి ఉన్నట్లే. నామి తోడుంటే మనసుకు బలం, ధైర్యం. విష్ణు కథలు వింటే అర్ధం అవుతుంది. ఆ స్వామి అండ ఎంత బలమో!

12_009 రామాయణాల ఇంద్రధనస్సు

అతడా గ్రంథ శ్లోకములందు మరి నాలుగు కావ్యములు గర్చితములగునట్లు కూర్చెను. అయోధ్యకాండ నుండి యుద్ధకాండము వరకును గల శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కలిపి చదివినచో “ గౌరీ వివాహ”మను కావ్యమును – ద్వితీయ పాదములందలి ప్రధమాక్షరములన్నియు కలిపినచో “ శ్రీరంగాది క్షేత్రమహాత్మ్యము ” – తృతీయ పాదాద్యక్షరములన్నియు కలిపినచో “ భగవదవతార చరిత్ర ” కావ్యమును – చతుర్థ పాదమునందలి అక్షరములన్నియు కలిపినచో “ ద్రౌపదీ కల్యాణం ” కావ్యమును ఏర్పడును. బాలకాండమునందలి శ్లోకముల ప్రధమాక్షరములన్నియు కూర్చినచో “ రామకవచ ”మేర్పడును. ఇది చతుస్సర్గ కావ్యమన ప్రశంసించబడినది.

12_009 శ్రీరామ రామేతి

శ్రీ విష్ణు సహస్రనామ పారాయణతో సంబంధం గలిగిన శ్లోకం ‘ శ్రీ రామ రామేతి…. ’. ఆ సంబంధం ఏమిటి ? అసలు సహస్ర నామ ప్రాశస్త్యం ఏమిటి ? ఎందుకు చదవాలి ? దానికి ఈ శ్లోకము ఎలా ప్రత్యామ్నాయము అవుతుంది ?… ఈ విశేషాలు…..