Venugoparao

13_009 శాస్త్రాన్ని శోధించాలి – డా. పప్పు వేణుగోపాలరావు

ప్రాచీన జ్ఞానాన్ని సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా గ్రంథస్థం చేసే బృహత్ కార్యం కోసం, ఆ జ్ఞానాన్ని ఉపన్యాసాల ద్వారా ప్రజలకు చేరువ చేసేందుకు కొత్తతరం ముందుకు రావాలి. ఆసక్తి ఉన్నవారు సంగీత కళాప్రదర్శనలో ఒక స్థాయికి వచ్చాక శాస్త్రం మీద దృష్టి పెట్టాలి. లక్షణ గ్రంథాలను పరిశోధించాలి. రాగం, లయ, కాల ప్రమాణం, చరిత్ర వంటి విషయాల లోతుపాతులను తెలుసుకోవాలి. గ్రంథాలను వెలువరించి వాటి సారాన్ని విద్యార్థులకి, రసికులకి అర్థమయ్యేలా ప్రాయోగికోపన్యాసాలు చేయాలి. సంగీత జ్ఞానప్రవాహాన్ని కొనసాగించాలి.