04

రాగచికిత్స

మూల రచయిత :

టి. వి. సాయిరాం, నాదా సెంటర్ ఫర్ మ్యూజిక్ థెరపీ, న్యూఢిల్లీ

ఔట్ లైన్స్ ఆఫ్ సైటాలజీ (1970)

ఇండిన టెంపుల్: ఫార్మ్స్ అండ్ ఫౌండేషన్స్ (1982-2000)

ఫిస్కల్ పాలసీ అండ్ ఎన్వైరన్మెంట్ (1986)

హోమ్ రెమెడీస్ వాల్యూం 1 -IV (1998-2000)

మెడిసినల్ మ్యూజిక్  (2004)

వాట్ ఈజ్ మ్యూజిక్ (2006)

సెల్ఫ్  మ్యూజిక్  థెరపి (2007)

ది పెంగ్విన్ డిక్షనరీ ఆఫ్ ఆల్టర్నేటివ్  మెడిసిన్ (2007)

తెలుగు అనువాదం :

కాళీపట్నం సీతా వసంతలక్ష్మి, ఎమ్ ఏ , ఎమ్ టీ, టీ ఎమ్, ఫోన్; 9810435949, website: sunadavinodini.com

రచయిత్రి గురించి:

శ్రీమతి కాళీపట్నం సీతా వసంతలక్ష్మి – గాయని, సంగీతజ్ఞురాలు, సంగీత చికిత్సా నిపుణులు, రచయిత్రి, భాషా శాస్త్రవేత్త గా ప్రసిద్ధులు.  ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరానికి చెందిన సంప్రదాయ భావరాజు కుటుంబం నుంచి వచ్చిన వసంతలక్ష్మి గత అర్థ శతాబ్ద కాలంగా కళా, సాహిత్య, భారత సంస్కృతీ వికాసాలకు ఎనలేని సేవ చేస్తున్నారు.

ప్రముఖ చరిత్రకారులు భావరాజు వెంకట కృష్ణారావు, మద్రాసు మ్యూజిక్ అకాడెమీ పూర్వాధ్యక్షులు విస్సా అప్పారావు గారల పెంపకంలో నాలుగు సంవత్సరాల వయసులోనే సంగీత ప్రపంచంలోనికి అడుగు పెట్టారు వసంతలక్ష్మి.

తాళబ్రహ్మ, సంగీత నాటక అకాడెమీ పురస్కార గ్రహీత ఎం. ఎస్. బాలసుబ్రహ్మణ్య శర్మ గారి వద్ద సుమారు 15 సంవత్సరాల పాటు కఠోర శిక్షణ తీసుకుని ఎన్నో పోటీల్లో పాల్గొని బహుమతులను అందుకున్నారు.

1961 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాలలో పాల్గొని అప్పటి ఉపరాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ల నుండి సత్కారం పొందారు. 1966 లో ఆకాశవాణి నిర్వహించిన కర్ణాటక ఉపశాస్త్రీయ సంగీత్ పోటీల్లో పాల్గొని రాష్ట్రపతి పురస్కారం అందుకున్నారు.

భోపాల్ లోని ధార్వాడ్ ఘరానా కు చెందిన శ్రీ సిద్ధిరామస్వామి కోర్వార్ వద్ద తొమ్మిది సంవత్సరాలపాటు హిందూస్థానీ లలిత సంగీతం లో శిక్షణ తీసుకుని గీత్, భజన్ లను ఎంతో నిబద్ధతతో అలపిస్తూ ముంబై కి చెందిన ప్రముఖ సంగీతజ్ఞులు ఆచార్య బృహస్పతి, ప్రముఖ గాయకులు సింగ్ బంధు వంటి వారి సరసన పేర్కొనబడ్డారు.

1971 నుండి కర్ణాటక లలిత సంగీతం, కర్ణాటక శాస్త్రీయ సంగీతం, హిందూస్థానీ సుగమ్ సంగీత్ లోని గీత్, భజన్ వర్గాలలో ఆకాశవాణి కళాకారిణిగా రాణిస్తున్నారు. 70 వ దశకంలో రామచరిత మానస్ ను ‘ మానస్ గాన్ ’ పేరిట ఆమె చేసిన గానం ఆకాశవాణి ద్వారా ప్రసారమై, దేశంలో హిందీ మాట్లాడే ప్రాంతాలన్నిటిలోను పేద – ధనిక, వయో బేధాలు, లింగ బేధాలు లేకుండా అందర్నీ అలరించింది. తులసీదాసు పదాలను సంప్రదాయ హిందూస్థానీ రాగాల లో స్వరపరచి, వాటికి కళాత్మక, సంగీత సౌందర్యాన్ని అద్దిన సమూహంలో సభ్యురాలు వసంతలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణిలో సంవత్సరం పాటు ప్రసారమై, తర్వాత కూడా అనేకసార్లు పునః ప్రసారమై అప్పటి రాష్ట్రపతి శ్రీ శంకర దయాళ్ శర్మ గారి ప్రశంసలను అందుకొంది.

తులసీదాస్ నాలుగు శతాబ్దాల జన్మదినోత్సవ సంబరాల్లో కూడా ఆమె పాల్గొన్నారు.

సంస్కృత భాష మీద గల మక్కువ ఆమెను సంగీతం ద్వారా ఆ భాషా ప్రచారానికి పురిగొల్పింది. ఆ దిశలోనే మరొక మహత్తర కావ్యం జయదేవుని ‘ గీతగోవిందం ’ ను ఆకాశవాణి కోసం సంగీత రూపకంగా మలచి అనేక చోట్ల ప్రదర్శనలిచ్చారు. తర్వాత ఈ కార్యక్రమం ఆకాశవాణి జాతీయ కార్యక్రమంలో కూడా ప్రసారమయింది. ప్రతీ అష్టపది ఆ భాషాసంస్కృతిని ప్రతిబింబించే విధంగా విభిన్నమైన పద్ధతుల్లో, స్వరకల్పనలతో రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం పత్రికారంగ ప్రశంసలను కూడా అందుకొంది.

ఆకాశవాణి, దూరదర్శన్ ల కోసం శ్రీనగర్, ఢిల్లీ, ముంబై, వడోదరా, అహమ్మదాబాద్, రాయిపూర్, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై వంటి నగరాల్లో అనేక కచేరీలు చేశారు వసంతలక్ష్మి.

 

***********************************************************

అధ్యాయం 1

 

“విశ్వం అంతా అద్భుతాలమయం

ఓపికగా మన మేధస్సును చేసుకోవాలి సునిశితం ”

–  ఈడెన్ ఫిలిపాట్స్

 

మనకందరకూ సంగీతం ఒక అనుపమానమైన అనుభవం. ఎవరైనా దానిని విని, ఆ సౌరభాన్ని ఆస్వాదించగలరు. సంగీతం కూడా ఒక రకమైన శబ్దమే ఐనప్పటికీ, దాని మూలాలు  శబ్దాలే అయినప్పటికీ, ఒక విధానం, వ్యవస్థ కలిగి ఉన్నందువలన ఇది చెవులకు ఇంపుగా ఉంటుంది.

ఒట్టి  శబ్దం వలె కాక, సంగీతం కొన్ని శబ్దాల ఝరుల ( శ్రుతుల)కూర్పు, అంటే కొన్ని నిశ్చితం మరియు ఆకృతి గల విధానంలో మెదడు శోధించి అర్థం చేసుకోగల రీతిలో ఉంటుంది.

 

సంగీతం: ముఖ్య లక్షణాలు 

 

సంగీతం ఎంతో సరళమనిపించినా, దాని గురించి తెలుసుకోనారంభించగానే అది ఎంతో అగమ్యగోచరంగా  అనిపిస్తుంది. దానిని గుర్తించటం లేదా ఆస్వాదించటం సాధ్యమే అయినా, అది మన మేధకు అందనిది. అందుచేత సంగీతంలో మనం కొన్ని అంతర్గతమైన మరియు అంతర్లీనమైన వైరుధ్యాలు కానవస్తాయి. స్థాయి, స్థాయిలను దాట గలగటం కేంద్రీకృతం అయినా అస్పష్టం, తీవ్రం అయినా విస్తృతం, ప్రత్యేకం అయినా విశ్వజనీనం, స్థిరం అయినా గానీ చంచలం. ఈ పరస్పర వైరుధ్యాలే మనలో ఉండే తత్వజ్ఞులకు ఒక సస్యశ్యామలమైన వేదికను అందచేసి, ఈ అనుభవానికి వివరణ, భాష్యం చెప్పుకునే అవకాశాన్నిస్తాయి.

 

హెగెల్ అభిప్రాయంలో – అన్య కళల వలే గాక సంగీతం శూన్యంలో జీవించి ఉండలేదు. అందుచేత ఇది “నిష్పాక్షికంగా” ఉండలేదు.

 

ఫ్రాంక్ జాపా అనే అమెరికన్ రాక్ సంగీతకారుడు, ప్రదర్శిత గీతాన్ని ఒక రకమైన శిల్ప కళ అనీ, ” ప్రదర్శన లో గల వాయువును ఒక ఆకృతిగా మలచటం ” అవుతుందనీ అంటాడు.

 

క్లాడ్ లీవైస్త్రాస్ అనే  శాస్త్రజ్ఞుడు (యాన్థ్రపాలజిస్ట్) సంగీతం ఒకే సమయంలో కూడా అర్థం అవుతూ కూడా కానిదని అభివర్ణించాడు. సంగీతం వింటున్నప్పుడు ప్రతి వ్యక్తిలోనూ ఒక మౌలిక లయ అనుభవంలోకి వస్తుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. ఇదే వాదాన్ని నాదయోగం ప్రచలితం చేయాలని ప్రయత్నించినా అది అఘాతాలలో పడిపోయింది.

రోజర్ స్క్రూతాన్ ప్రకారం శబ్ద సామ్రాజ్యం లౌకిక ప్రపంచం నుండి కేవలం మేధో పరిధుల చేతనే వేరుగా ఉంచబడుతోందనీ, సంగీతపు అనంత ఆకాశం, అనంత సమయం రెంటికీ సాటిగా నిలబడినది.   కావ్యాన్ని / గీతాన్ని పుట్టించగల శక్తి అత్యంత సాధారణమయినదనీ అంటాడు.

 

ముఖతః సంగీతం అంటే మన స్వంతమైన అనుభవం, ఆలోచనలు, విజ్ఞత. దీనికి ఒకవిధమైన తక్షణ శక్తి ఉంది, ఎందుకంటే ఇది నేరుగా మన ఆత్మను స్పృశించగలదు. ఎటువంటి పరిచయమూ, ఎట్టిరకపు వివరణలూ అవసరం లేదు. ఇది తిన్నగా మనలను తాకగలదు: సంగీతం చెప్పేదానిని గురించి మనకు అవగాహన ఉంటుంది. అది ఎవరూ నేర్పనక్కరలేదు. తగ్గులు, జీవితంలో మనం అనునిత్యం ఎదుర్కునే ఎగుడు దిగుళ్ళను పోలి ఉంటాయి.

 

సంగీతానికి ఉన్న సౌందర్యం, ఔపయోగిక విలువ, అది మనకందించేది ఒక ధారావాహికంగా నొక్కి వక్కాణించ లేని అంతులేని శక్తి. ఈ అంశాన్ని రాబోయే పుటలలో చర్చిద్దాం.

***********************************************************

3. మందాక్రాంతా…                                                                                                   5. మేఘదూతం….