10_015

10_015 వార్తావళి

వంగూరి ఫౌండేషన్ నిర్వహిస్తున్న “ 26వ ఉగాది ఉత్తమ రచనల పోటీ ” వివరాలు, కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ కార్యక్రమ వివరాలు, చెన్నై లోని వేద విజ్ఞాన వేదిక వారి ‘ తర తరాల తెలుగు కవిత ’ ఉపన్యాస కార్యక్రమంలో భాగంగా “ అడవి బాపిరాజు నవలా వైశిష్ట్యం ” వివరాలు….

10_015 ఆనందవిహారి

చెన్నై లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి నిర్వహిస్తున్న ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ భువనచంద్ర గారి “ గురుబ్రహ్మ “ ప్రసంగం, విశేషాలు……………

10_015 కబుసర తో కరోనా ఫట్

ఈ కరోనా వచ్చి దడదడలాడించినా మొదట్లో ఓ పది రోజులు రాలేదు. తర్వాత ముక్కుకి, మూతికి కలిపి మాస్క్ కట్టుకుని శానిటైజర్ బ్యాగులో పెట్టుకుని వచ్చేసింది. ఔరా! అని అందరు జెలసీగా చూసి, ‘ ఆ.. ఆవిడ కాఫీ మహత్యం! ’ అనుకున్నారు.

10_015 స్వేచ్ఛ

పచ్చటి పైర్లమీదుగా
ఊళ్ళోకి ప్రవేశించిన
మలయ వీచికను
దేహంతో స్పృశించినా…

10_015 ప్రొ. కొండేపూడి వెంకటరత్నం

వాడు చదువుకునే రోజులలోనే రోజూ రాత్రి ఒంటి గంట వరకూ చదువుతూనే ఉండేవాడు. మేడ మీద గదిలో గచ్చు మీద చాక్ పీస్ తో వర్క్ చేసుకునేవాడు. రోజూ కాలేజీ కి నాలుగు మైళ్ళు ( రానూ పోనూ ఎనిమిది మైళ్ళు ) సైకిలు తొక్కుకుంటూ వెళ్ళేవాడు…..
… తాను రెండో సంవత్సరం, మూడో సంవత్సరం చదువుతూండగానే హాస్టల్ పిల్లలు వీడికి సీనియర్లు. వాళ్ళ వాళ్ళ రూం లకు వీడిని పిలుచుకుపోతూ ఉండేవారు, చదువులలో వారి సందేహ నివృత్తి కోసమని. వీడి మేధ ఆ స్థాయి లో ఉండేదన్నమాట !!

10_015 ఆడపిల్ల ‘ఆడ’ పిల్లే!

నేను చేసినవన్నీ బ్యాగ్ లో సర్ది చేతికిస్తే “ వాటీజ్ దిస్? ” అంటూ ప్రశ్నించింది. నేను “ మీకోసం చేసాను, నువ్వు పట్టికెళ్ళడానికి ” అన్నాను. మా అమ్మాయి వెంటనే “ ఇవన్నీ నేను తీసికెళ్ళలేను, అయినా నేను కావాలని అడగలేదే? ” అంది నిర్మొహమాటంగా.
“ నో డాడ్! ఇప్పుడు ఇవన్నీ తీసికెళ్తే మా రొటీన్ అంతా మెస్ అప్ అవుతుంది. అదీకాక అమ్మ వంటలో పులుపు, కారాలు ఎక్కువగా ఉంటాయి. మా ఇంట్లో కారం చాలా తక్కువగా తింటారు. పులుపు అయితే అస్సలు మా ఇంట్లో దగ్గరికే రానివ్వరు. థాంక్స్ ఎనీ వే ” అంటూ వెళ్ళిపోయింది. పెళ్ళి అయినప్పటి నుంచీ మా అమ్మాయి మాటల్లో “ మా ” అనే పదం ఉండటం గమనించాను.

10_015 పాలంగి కథలు – కోనసీమ జ్ఞాపకాలు

చిన్నతనపు జ్ఞాపకాలు మధురానుభూతులే. వాటిని గుర్తుచేసుకోవడం ‘వాస్తవానికి ఊరట’. అలా ఓసారి గతంలోకి వెళ్తే ….! జ్ఞాపకాలు కళ్లల్లో మెదులుతాయి!!
‘ఆ గోదారి! దాంట్లో లాంచీ ప్రయాణం. పచ్చటిపొలాలు, కొబ్బరి, తాటితోపుల మధ్య కాలువ పక్కగా సాగే రోడ్డు, దుమ్ము రేపుకుంటూ గతుకుల రోడ్డు మీద ప్రయాణం, ఊరు చేరాక ఒంటెద్దు బండి మీద ఇల్లు చేరడం! తాతలనాటి పెంకుటిల్లు….. …….చెప్పుకుంటూ పోతే…ఎన్ని ఆనందాలో!!!

10_015 కథావీధి – చాసో రచనలు 4

దేవుడి రథయాత్ర సందర్బంగా జరిగే తీర్థానికి అబ్బాయి ప్రయాణం కడతాడు. తీర్థం లో ఖర్చుల కోసం నాన్న కానీ ఇస్తాడు, అమ్మని అదిలించుకుని అర్ధనా తీసుకుంటాడు అబ్బాయి. నాన్నమ్మ గారం చేసి ఒత్తుల పెట్టె లోనుంచి ఇంకో అర్ధనా ఇస్తుంది. తీర్థానికి వెళ్లేముందే అబ్బాయి లెక్కలు వేస్తాడు. రంగుల రాట్నానికి కానీ తప్పదు. ఇంకా పకోడీలూ, బంగరమూ, తాడూ ఉన్నాయి. ఎరుపూ ఆకుపచ్చ రంగుల బంగారం కొనక తప్పదు. ఇలా లెక్కలు కట్టుకుంటూ తీర్థానికి వెళ్లిన అబ్బాయి….