10_017
10_017 వార్తావళి
చెన్నై అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ’ కార్యక్రమంలో భాగంగా ‘ నెట్ ’ ఇంట్లో సమావేశం “ పి. వి. రాజకీయ సాహితీ వ్యక్తిత్వం, కృష్ణా జిల్లా రచయితల సంఘం స్వర్ణోత్సవ కార్యక్రమ వివరాలు…..
10_017 ఆనందవిహారి
చెన్నై లోని అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి నిర్వహిస్తున్న ‘ నెల నెలా వెన్నెల ‘ కార్యక్రమంలో భాగంగా
“ వీరనారి ” ……..
10_017 సుమాంజలి
శ్రీనిధి దేశ విదేశీ సాంకేతిక విజ్ఞాన నవనిధి
శాస్త్రి గారి చేతి రక్షాబంధనం దేశ రక్షణా ప్రభంజనం
దేశ రక్షణ పరికరాల తయారీకి జంటనగరాలలో స్థాపించిన నవనిధి
10_017 బోట్స్‌వానా లో ఉగాది
అక్కడ మన దేశస్థులు కలుసుకునేందుకు “ హిందూ టెంపుల్ ” ఉంది. ప్రతివారం మన తెలుగు వాళ్లందరం కలిసి భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఉగాదికి.
అంతవరకు కొద్దిమంది కలిసి పండగలు చేసుకునేవారు. కానీ మేము ఉగాదికి భజన కార్యక్రమం మొదలు పెట్టాము. మొదటిసారిగా భజన పద్ధతిగా అంటే – గణేశ ప్రార్థన, భగవంతుని ఇతర నామాలతో భజనలు ఇంగ్లీష్, తెలుగులో రాసి పంచి పాడించేవాళ్లం. ఆఖరుగా మంగళహారతి, ప్రసాదాలతో సహా క్రమ పద్ధతిలో జరుపుకునేవాళ్లం.
10_017 ద్విభాషితాలు – చలి కానుక
చలితెరల్ని తొలగించుకొంటూ…
ఊరివెలుపల వెలుగులోకి…
ఉదయపు అడుగుల్ని నడిపిస్తే…
హేమంత సౌందర్యం…
మనసును ఆవరిస్తుంది.
10_017 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – యాంకరింగు
తన తండ్రీ, పినతండ్రులు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నకారణంగా, వారి ప్రభావంతో చాలా చిన్నవయసులోనే గాంధీ గారి సూత్రాలను అర్ధం చేసుకుని ఇప్పటికీ పాటిస్తున్న వ్యక్తి ఆయన. నిరాడంబరంగా ఖద్దరు బట్టల్లో ఉన్న ఆ పెద్ద మనిషి తన అనుభవాలు, అభిప్రాయాలూ చక్కగా చెప్పారు. పై నుంచీ కింద వరకు నగలు పెట్టుకున్న ఈ యాంకరు గారు బండి చక్రాలంత చెవి రింగులు ఊపుకుంటూ “ మీ మీద గాంధీ గారి ప్రభావం ఎంత వరకు ఉందీ?“ అని అడుగుతుంది!
10_017 పాలంగి కథలు – యానాం పెళ్లి
సంధ్యావందనం పూర్తి చేసుకుని ముందు వసారాలోకొచ్చి కూర్చుని మళ్లీ కబుర్లలో పడ్డారు కాబోయే వియ్యంకులు. ‘ఆ సర్కారువాళ్లేమిటి బావగారూ ఇలా అర్ధం పర్ధం లేని ఆర్డరేశారు. మన పద్ధతులు వాళ్లకేం తెలుసనో. మన ఆచార వ్యవహారాల్లో వాళ్లు కలగజేసుకోవడం ఏమిటో. చక్కగా కేశనకుర్రులో వైభవంగా చేయొచ్చు పెళ్లి అనుకున్నాను.’
‘అన్నట్లు యానాంలో పెళ్లి చేస్తే ఈ ఆర్డరు వర్తించదని అక్కడికి తీసుకు వెళ్లి చెయ్యండని సలహా ఇచ్చారు నడింపల్లి రాజు గారు. చాలా ఇబ్బందే. అయినా మరో దారి లేదు మరి.’
10_017 కథావీధి – వడ్డెర చండీదాస్ రచనలు 01
ధైర్యం లేని మనిషికి వేరే ఎన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ రాణించవు. కారణం ఏమిటంటే వాటన్నిటినీ, ప్రకటించడానికీ, ఆచరణలో పెట్టడానికీ, అతని ధైర్య లేమి అడ్డుపడి అతన్ని నిష్క్రియా పరుణ్ణి చేస్తుంది. తత్‌ఫలితం గా అతను అసమర్ధుని గా ముద్ర వేయించుకుని అసహ్యించుకోబడతాడు.
10_017 బాలభారతం – అన్నలం ! తమ్ములం !!
అన్నాదమ్ముల
మెందఱ మున్నా
కన్నతల్లి ఒక్కతే !
మనకన్నతల్లి ఒకతే !