12_012

12_012 వార్తావళి

“ 13వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ” వివరాలు, “ డయస్పోరా తెలుగు కథానిక ”, వివరాలు, …..

12_012 ఆనందవిహారి

అమెరికా లోని చికాగో నగరంలో జరిగిన అంతర్జాతీయ వీణా ఉత్సవాలలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు వీణాపాణి ప్రదర్శన విశేషాలు,……

12_012 చేతికొచ్చిన పుస్తకం 15

పక్ష పత్రిక “ డౌన్ టు ఎర్త్ ”, కే. ఆర్. శేషగిరిరావు గారి సంపాదకత్వంలో “ Studies In the History of Telugu Journalism ”, పోల్కంపల్లి శాంతాదేవి “ ఇల వైకుంఠపురం ”, ద్వైమాస పత్రిక ‘కవిసంధ్య’, “ Half way-
The Golden Book ”…. పుస్తకాల గురించి…..

12_012 అందాల గోదావరి

శ్రీమతి సి. ఇందిరామణి గారి స్వరకల్పనలో శ్రీ ఎల్. మాలకొండయ్య గారు రచించిన ఈ బృంద గానం చేసినవారు డా. చిత్రా చక్రవర్తి, హారిక పమిడిఘంటం, సీతా అనివిళ్ల, సుధా తమ్మా.

12_012 అపరాధ సహస్రాణి

కళలమ్మ పాదాలపై పడి జన్మలు వేడుకున్నా దొరకని వరం కళాప్రవేశం!
రేణువంత దొరికినా అది ఆ చల్లనితల్లి కృప!
ఏదో జన్మవాసనలు మనసునిపట్టి ఏదైనా ఒక్క లలితకళలో ఆవగింజంత అభినివేశం దొరికినా జన్మధన్యమే!
దానిని పరిపూర్ణాంగా కాకపోయినా..కొనఊపిరి ఉన్నంతవరకూ నిలబెట్టుకోవడం అసిధారావ్రతం!

12_012 తిరువారూరు విశిష్టత

కాలం చేసిన తరువాతే “ సంగీత త్రిమూర్తులు ” గా పేరు గాంచినా, వారికి మాత్రం ముందే తెలిసిందేమో…. తాము కారణ జన్ములమని, అందుకే ముగ్గురూ ఒకే ఊరిలో, అది కూడా ఒకే ఆలయానికి దగ్గరలో జన్మించారు. ఒకే కాలంలో జీవించి సమకాలికులయ్యారు. ఆ పుణ్యభూమే తమిళనాడులోని తిరువారూరు. వారు పుట్టిన తరువాత వారి వారి కుటుంబాలు తిరువయ్యూరు తదితర ప్రాంతాలకు తరలి వెళ్ళినా చరిత్రకు ఆనవాళ్ళుగా, సంగీత విద్యార్థులకు తీర్థ యాత్రా స్థలాలుగా ఇప్పటికీ ఆ మహా వాగ్గేయకారులు జన్మించిన ఇల్లు వెలుగొందుతున్నాయి.

12_012 విప్రనారాయణ చరితం

పరమ భక్తుడైన విప్రనారాయణుడు విష్ణువుని రంగనాథుడి రూపంలో కొలుస్తూ ఉంటాడు. చోళ రాజు ఆస్థానంలో నృత్య ప్రదర్శన తర్వాత నర్తకి దేవదేవి తన చెల్లెలు మధురవాణితో కలసి వస్తూ విప్రనారాయణుని ఆశ్రమం మీదుగా వస్తూ ఉంటుంది. తనని పట్టించుకోకుండా దైవ కైంకర్యంలో మునిగిపోయిన నారాయణుని చూసి అహంకారిగా, పొగరుబోతుగా తలచి, అతనికి గుణపాఠం చెప్పాలనుకుంటుంది. అనాధగా చెప్పుకుంటూ నారాయణుని ఆశ్రమం లోకి ప్రవేశించి సహాయం కోరుతుంది. అయితే ఆమె ఆశ్రమంలో ఉండడంలోని ఉద్దేశ్యాన్ని పసిగట్టిన నారాయణుడి శిష్యుడు రంగరాజు అభ్యంతరం చెప్పినా వినకుండా అతన్ని బయిటకు పంపించి దేవదేవిని శిష్యురాలిగా చేసుకుంటాడు నారాయణుడు.