September 15, 2020

10_003 అభిప్రాయకదంబం

శుభాభినందనలు ఆంధ్రత్వమాంధ్ర భాషాచ..నాల్పస్య తపసః ఫలమ్ అని అప్పయ్య దీక్షితులంటే….    ...

10_003 వార్తావళి

అంతర్జాలంలో హూస్టన్ ( US ) నుంచి “ శాస్త్రీయ సంగీత కచేరీలు “….. “ 7 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ”….. విశేషాలు……

10_003 ఆనందవిహారి

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై వారు అంతర్జాలంలో నిర్వహించిన ప్రముఖ రచయిత, కవి రెంటాల గోపాలకృష్ణ గారి శతజయంతి సమావేశంలో ” నవ్య కవితా కల్పనా శిల్పి – రెంటాల ” అనే అంశంపై ప్రముఖ రచయిత శ్రీ శ్రీవిరించి ప్రసంగం, ” కరోనా నేపథ్యంలో మానవుని జీవితం – విశ్లేషణ ” అనే అంశంపై ఆచార్య విస్తాలి శంకరరావు గారి ప్రసంగం విశేషాలు….

10_003 పుస్తక సమీక్ష – మనుచరిత్రము

మనుచరిత్ర వరూధిని, ప్రవరాఖ్యుల కలయిక తో అంకురార్పణ గావించుకుని క్రమేపీ స్వారోచిషమనుసంభవం గా రూపాంతరం చెందుతుంది. వరూధిని, ప్రవరాఖ్యుల సమాగమం లో శృంగారరస ప్రస్తావనలు కొన్ని చోటు చేసుకుంటాయి. అవి రక్తికి – అనురక్తి కి ఆలంబనలు కదా !
అల్లసాని పెద్దనామాత్యుడు ఆంధ్ర కవితాపితామహునిగా వాసికెక్కాడు.

10_003 అమెరికా ఇల్లాలి ముచ్చట్లు – గ్రాండ్ పేరెంట్స్

నా అన్న వాళ్ళు లేకుండా మొండి ధైర్యంతో ఈ దేశం వచ్చి పడ్డాం. అందరి మధ్యా ఉండటం అలవాటయిన పిల్లలు ఇక్కడికి రాగానే బెంగ పెట్టుకున్నారు. రాము అయితే “ ఇక్కడ రిక్షాలు లేవు ఈ ఊరు ఏం బాలేదు, మనింటికి వెళ్లి పోదాం “ అని గొడవ చేసేవాడు గుర్తుందా ? కొద్ది రోజుల తర్వాత ఇద్దరు బుడి బుడి అడుగులేసుకుంటూ కొత్త స్కూలుకు వెళ్లటం మెదలు పెట్టారు. మనమూ తడబడుతూ.. భయపడుతూ అమెరికాలో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాం.

10_003 తో. లే. పి. – ఏ. కె. వి. సన్యాసిరావు

సన్యాసిరావు గారు ప్రవృత్తిపరం గా చూస్తే ఆయన లో ఒక రచయిత, కళాకారుడు, క్రీడాకారుడు ఉన్నారు. నాటకాలలో పాల్గొనడం, ఆధ్యాత్మిక రచనలు చేయడం, చదరంగం పోటీలలో పాల్గొనడం, యోగా క్లాసులకు హాజరవడం చేస్తూ ఉండేవారు.

10_003 చిత్రకళ

‘ ముద్దుకృష్ణ ‘ – చిత్రం : రాజవరం ఉష
‘ పల్లె పడుచు ‘ – చిత్రం : రాజవరం ఉష

10_003 కథావీధి – మధురాంతకం ‘ అప్పుల నరసయ్య ‘

బడిలో కొత్తగా చేరిన పంతులు గారిని అప్పల నరసయ్య కలుపుగోలుతనం ఆకర్షిస్తుంది. పంతులుగారికి ఇంటి పనీ, బడి పనీ ఎక్కువగా లెని కారణం చేత నరసయ్య గారి అంగట్లో కొంచెం కాలక్షేపం అవుతూ ఉంటుంది. పనిలో పని గా నరసయ్య గారి దానగుణం, నిరాడంబరత్వం, పరోపకారత్వం అవగతం అవుతుంది.

10_003 శ్రీపాదకథలు – అరికాళ్ళ క్రింద మంటలు

సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం గారి అభ్యుదయ భావాలను, వితంతు పునర్వివాహాన్నీ ఈ కథలో సమర్థిస్తారు శ్రీపాద వారు. అర్థరాత్రి ఇల్లు విడిచిపెట్టిన రుక్కమ్మ ఒక జట్కా బండి మనిషి సాయంతో వీరేశలింగం పంతులుగారి తోటకు వెళ్తుంది. ఆ నరకంలోంచి ( పుట్టింటి నుంచి ) బయటపడడం తప్ప వేరే మార్గం లేదనుకుని ధైర్యం చేసిన బాల వితంతువు దయనీయ గాథ ఇది.