September 2022

12_003 వార్తావళి

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, బే ఏరియా తెలుగు సంఘం ( బాటా ) స్వర్ణోత్సవ సంబరాలు, అమెరికాలో జ్ఞానధాత్రి శ్రీ మహాసరస్వతీ జ్ఞాన యజ్ఞ మహోత్సవము ‘ వివరాలు, చెన్నై వేద విజ్ఞాన వేదిక ‘ గడియారం వెంకట శేష శాస్త్రి సాహితీ వైభవం ’, చెన్నై అమరజీవి స్మారక సమితి వారి ‘ నెల నెలా వెన్నెల ’ లో భాగంగా “ జగమునేలిన తెలుగు ” కార్యక్రమాల వివరాలు…

12_003 ఆనందవిహారి

చెన్నై అమరజీవి స్మారక సమితి అధ్వర్యంలో నెల నెలా వెన్నెల కార్యక్రమంలో భాగంగా “ కూచిపూడి నాట్య విశిష్టత ” కార్యక్రమ విశేషాలు….

12_003 చేతికొచ్చిన పుస్తకం 07

“ కొప్పర్రు చరిత్ర ”, “ ఇప్పచెట్టు నీడలో ”, ‘ కన్నవీ, విన్నవీ ”, ‘ అదృశ్యమైన నిప్పుపిట్ట కోసం ”, “ కొంగలు గూటికి చేరిన వేళ ”…. పుస్తకాల పరిచయం…..

12_003 కన్యాశుల్కం – ఒక పరిశీలన 02

నాటకం లో కన్యాశుల్కం, వయో వృద్ధులతో బాలికల కు వివాహం జరిపించడం అనే విషయాలని సౌజన్యా రావు వకీలు తప్ప విడిచి వేరెవరూ ఖండించరు. మిగతా పాత్రలకి కన్యాశుల్కం అసలు విషయమే కాదు. ముగింపు అర్ధాంతరం గా ఉంది అని మనకి ముందు అనిపించినా, అదే తార్కికమైన, సహజమైన ముగింపు అని మనకే అనిపిస్తుంది. రచయిత కి ఇంకో దారి ఉండదు.

12_003 ఉన్మత్త రాఘవం 02

ఎఱ్ఱని అశోక వృక్షపు నవ పల్లవములే గాని పద్మ రాగ భరిత హారములు కావు. కోమలములగు చిరు మొగ్గల వరుసలె గాని శ్వేత మౌక్తిక మాలలు కావు.
వివిధ వర్ణములతో నొప్పు పుష్ప గుచ్ఛములే కాని నవ మణి సహిత భూషణములు కావు.
నిజముగా నివి నవ వికసిత చంపక పుష్ప సమూహములు గాని వింజామరములు కావు.
ఇవి విస్తరించి వంగిన శాఖలతో గూడి, యాకసము నంటు వృక్షములే గాని తస్కరించిన యాభరణా లంకృతులు, కరము చాపి దండెత్తు తస్కరులు కారు.

12_003 తో. లే. పి. – దశిక శ్యామలాదేవి

” అమెరికా ఇల్లాలి ముచ్చట్లు “. అసలు ఆ టైటిలే మహా గొప్పగా అనిపించింది నాకు. రచయిత్రి శ్రీమతి దశిక శ్యామలాదేవి. సరే ! .. అందిన ఆ ‘అనుభవాల ‘ సంకలనం నన్ను, నా మనసును అయస్కాంతం లా ఆకర్షించింది మరి ఏ విషయమయినా సరే — విన్నా, చదివినా నాకు నచ్చితే గనక వెను వెంటనే స్పందించడం మరి నాకు అలవాటో, మరొకటో ఇధమిత్తం గా చెప్పలేను, శ్యామలాదేవి గారికి నేను నా స్పందనను తెలియజేయడం, వారు వెంటనే ప్రతి స్పందనను నాకు అందించడం జరిగాయి… ఆ రచనలలో ఉన్న మాధుర్యమే మమ్మల్ని మరింత సన్నిహితులను చేసింది,

12_003 ఆలస్యం..అమృతం..

నిత్యజీవన కర్మాగారంలో …
ఓ యంత్రాన్నై…
నీ వద్దకు రావడానికి…
నిన్ను కలవడానికి…
తీరిక లేక…
కాస్త విరామ సమయం కోసం..
ఎదురు చూస్తున్నా.

12_003 మాతృభాష

అన్నిభాషలందు అతనిపాండిత్య
మొక్కరీతి మెఱయుచున్నకతన
పచ్చివెలగకాయ వచ్చి గొంతున పడ్డ
యట్టు లయ్యె పండితాళి కెల్ల !